Share News

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:29 PM

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌ క‌ప్‌ 2026లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ ఆశలు క్లిష్టంగా మారాయి. అయితే ..

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!
India semi final chances

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నిన్న(ఆదివారం) సౌతాఫ్రికాతో జరిగి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టీమిండియా సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఒక్క ఓటమితో ఫలితాలన్నీ భిన్నంగా మారాయి. ట్రోఫీ గెలవాలనే కసితో ఉన్న టీమిండియాకు రాబోయే రెండు మ్యాచులు చాలా కీలకం కానున్నాయి. ఒక్క మ్యాచ్ ఓడినా సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే అని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా ఓటమి తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.


నిన్న ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ మారిజెన్ కాప్ (81 నాటౌట్‌) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో ఆరు వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందింది. ఈ విజ‌యంతో సౌతాఫ్రికా రెండు విజ‌యాలు సాధించి ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాల‌తో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉంది. అయితే భార‌త్ తొలి రెండు మ్యాచ్‌లు భారీ తేడాతో గెల‌వ‌డంతో మెరుగైన‌ నెట్ ర‌న్‌రేట్ (+2.511) కార‌ణంగా ప‌ట్టిక‌లో సౌతాఫ్రికా(-0.546), బంగ్లాదేశ్(-0.641) కంటే ముందుంది. ఆసీస్ ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి.. సెమీస్ రేసులో ఒక మెట్టు పైనే ఉంది.


ఇక భార‌త తమ చివరి రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ హ‌ర్మన్ సేన గెలిస్తే 8 పాయింట్లతో నెట్ ర‌న్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరుతుంది. అలా కాకుండా ఒక మ్యాచ్‌లో గెలిచి మ‌రో మ్యాచ్‌లో ఓడితే మాత్రం నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కానుంది. అదే సమయంలో సౌతాఫ్రికా కూడా ఒక మ్యాచ్ ఓడిపోవాలి. ప్రస్తుతం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ల‌తో పోలిస్తే భార‌త్ ర‌న్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది.


ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడినా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే టీమిండియాకు సెమీస్ చేరే అవ‌కాశాలు మెండుగా ఉంటాయి. బంగ్లాదేశ్ మ‌న‌పై విజ‌యం సాధిస్తే మాత్రం ర‌న్‌రేట్ ప‌డిపోయి హ‌ర్మన్ ప్రీత్ కౌర్ సేన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక భారత్ తాను ఆడ‌బోయే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌మిపాలైతే మాత్రం టోర్నీ నుంచి నేరుగా నిష్క్రమిస్తుంది. అప్పుడు సెమీస్ బెర్తు కోసం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ పోటీ పడతాయి. ఆస్ట్రేలియా మాత్రం మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటుంది.


ఇవి కూడా చదవండి:

విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. వీడియో వైరల్!

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

Updated Date - Jun 22 , 2026 | 04:51 PM