కేఎల్ రాహుల్ జెర్సీ సరిచేస్తూ కోహ్లీ సరదా.. వీడియో వైరల్!
ABN , Publish Date - Nov 07 , 2026 | 07:47 PM
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కేఎల్ రాహుల్ జెర్సీని సరిచేస్తూ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆటపట్టించాడు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నాలుగు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కేఎల్ రాహుల్ జెర్సీని సరిచేస్తూ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆటపట్టించాడు. మ్యాచ్ బ్రాడ్ కాస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసి.. రాహుల్, కోహ్లీ దీపావళికి సిద్ధమవుతున్నారంటూ రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో కేఎల్ రాహుల్ మైదానంలోకి వెళ్లే ముందు అతడి జెర్సీని విరాట్ కోహ్లీ సరిచేస్తూ కనిపిస్తాడు. రాహుల్‌కు సౌకర్యంగా ఉండేలా జెర్సీని సరి చేస్తున్నాడు. అతడి చేతుల స్లీవ్లను మడవడం, సరిగ్గా వచ్చేల చేయడం విరాట్ చేశాడు. అంతేకాక రాహుల్ జెర్సీ కాలర్‌ను కూడా కోహ్లీ సరి చేశాడు. అలా చాలా సమయం పాటు కేఎల్‌ను కోహ్లీ సరదా ఆటపట్టించాడు. అయితే ఈ సరదా సన్నివేశ సమయంలో ఈ ఇద్దరూ బ్యాటర్లు కూడా చిరునవ్వులు చిందిస్తున్నారు. వీరి మాటలకు పక్కనే ఉన్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం నవ్వుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదా కామెంట్స్ చేశారు. కోహ్లీ ఆటలోనే కాకుండా ఆటపట్టించడంలోనూ ముందే ఉంటాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవాళ జరిగిన రెండో వన్డేలో కోహ్లీ ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. అయినప్పటికీ న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో వికెట్లు కోల్పోయి తడబడుతున్న టీమిండియాను కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు. 38 బంతుల్లో 26 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో యువ బౌలర్ గుర్నూర్ బ్రార్(4-30) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. న్యూజిలాండ్ జట్టును 134 పరుగులే కట్టడి చేయడంలో గుర్నూర్ కీలక పాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి:
ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: మిచెల్ శాంట్నర్
బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ సరికొత్త రికార్డు..
షాహిద్ అఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..