Share News

ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: మిచెల్ శాంట్నర్

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:51 PM

భారత్‌తో జరిగిన రెండో వన్డేలోనూ న్యూజిలాండ్ ఓటమి పాలైంది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. టీమిండియా నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఓటమిపై కివీస్ జట్టు కెప్టెన్ మిచెల్ శాంటర్న్ స్పందించాడు.

ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: మిచెల్ శాంట్నర్
Mitchell Santner

స్పోర్ట్స్ డెస్క్: భారత్‌తో జరిగిన రెండో వన్డేలోనూ న్యూజిలాండ్ ఓటమి పాలైంది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. టీమిండియా నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఓటమిపై కివీస్ జట్టు కెప్టెన్ మిచెల్ శాంటర్న్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే మరోసారి తమ ఓటమిని శాసించిందని తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉందని, కానీ తాము 160-180 పరుగులు చేసి ఉంటే సునాయసంగా గెలిచేవాళ్లమని శాంట్నర్ అభిప్రాయపడ్డాడు.


ఈ మ్యాచ్ అనంతరం మిచెల్ శాంట్నర్ మీడియాతో మాట్లాడుతూ.... 'పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆరంభంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం ఏ మాత్రం మంచిది కాదు. మాకు ఆ తప్పిదమే జరిగింది. అలానే ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి మేం అన్నుకున్న దానికంటే తక్కువ లక్ష్యమే నమోదు చేశాం. భారత బౌలర్లు పిచ్ పరిస్థితులను బాగా సద్వినియోగం చేసుకున్నారు' అని శాంట్నర్ వెల్లడించాడు.


'మేం పోరాడి 160-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమైంది. మరోవైపు స్వల్ప లక్ష్యమే అయినా మా బౌలర్లు అద్భుతంగా పోరాడారు. తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయాలి. మా వాళ్లు ఆరంభంలోనే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో నిలబెట్టారు. కానీ దురదృష్టవశాత్తు వర్షం కారణంగా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు' అని శాంట్నర్ పేర్కొన్నాడు.


ఈ వార్తలూ చదవండి

పార్కింగ్ వివాదం.. టెక్ మహీంద్రా మాజీ బిజినెస్ హెడ్ హత్య..

మనవరాలి కోరిక మేరకే వైదిక వివాహం.. విమర్శలపై డీఎంకే నేత స్పందన..

Updated Date - Nov 07 , 2026 | 06:51 PM