Share News

బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ తౌహీద్‌ హృదోయ్‌ సరికొత్త రికార్డు..

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:57 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ అద్భుత పోరాటంతో అరుదైన రికార్డును సృష్టించాడు. కేవలం 184 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లా జట్టును బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో తౌహీద్ ఆదుకున్నాడు.

 బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ తౌహీద్‌ హృదోయ్‌ సరికొత్త రికార్డు..
Towhid Hridoy

స్పోర్ట్స్ డెస్క్: సిల్హెట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ అద్భుత పోరాటంతో అరుదైన రికార్డును సృష్టించాడు. కేవలం 184 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లా జట్టును బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో తౌహీద్ ఆదుకున్నాడు. మూడో రోజు ఆట ప్రారంభించే సమయానికి 29 పరుగులతో ఉన్న అతను, ఏమాత్రం తడబడకుండా ఆడుతూ తన కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడుతూ.. డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.


తౌహీద్ 359 బంతుల్లో 22 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 242 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే టెస్ట్ చరిత్రలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా తౌహీద్ చరిత్ర సృష్టించాడు. 2018లో జింబాబ్వేపై ముష్ఫికర్ రహీమ్ 219 పరుగులతో ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నాడు. తాజాగా తౌహీద్ అసాధారణ పోరాటంతో రహీమ్ రికార్డును అధిగమించాడు.


అంతేకాకుండా, తన మొట్టమొదటి టెస్ట్ సెంచరీని నేరుగా డబుల్ సెంచరీగా మలచడం ద్వారా బంగ్లాదేశ్ క్రికెట్‌లో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో మొమినుల్ హక్ 2013లో న్యూజిలాండ్‌పై 181 పరుగులు సాధించాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ చేసిన అత్యధి స్కోర్ ఇదే ఉండేది. తాజాగా ఆ రికార్డును కూడా తాహీద్ హృదోయ్ బ్రేక్ చేయడంతో పాటు జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. ఇందులో 242 తౌహీద్ హృదోయ్ చేయడం విశేషం.


ఇవి కూడా చదవండి:

షాహిద్ అఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..

మహ్మద్ షమీ రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురైన మోర్నె మోర్కెల్

రెండో వన్డేలోనూ న్యూజిలాండ్‌పై భారత్ విజయం

Updated Date - Nov 07 , 2026 | 06:13 PM