రెండో వన్డేలోనూ న్యూజిలాండ్‌పై భారత్ విజయం
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:51 PM
వెల్లింగ్‌టన్ వేదికగా ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్‌టన్ వేదికగా ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. 41 ఓవర్లలో కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది.
135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వన్డే కెరీర్‌లో తొలిసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ7 పరుగులకే నిష్క్రమించాడు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ స్కోర్ బోర్డును నిదానంగా కదిలించారు. అయితే, రోహిత్ 28 బంతుల్లో 23 పరుగులు చేసి కైలీ జెమీషన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. శ్రేయస్ 30 పరుగులు చేశాడు.
ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ (7), నమన్ ధీర్ (12) నిరాశపరచగా.. అన్షుల్ ఒక్క పరుగు చేశాడు. ఇలాంటి తరుణంలో టీమిండియా 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగుల వద్ద ఉన్న సమయంలో మరోసారి వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. అయితే, అప్పటికే డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం టీమిండియా నిర్ణీత లక్ష్యం (109) కంటే నాలుగు పరుగులు ముందంజలో నిలిచింది. దీంతో భారత్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందినట్లు అంపైర్లు ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గుర్నూర్ బ్రార్ అందుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మొత్తంగా టీ20 సిరీస్ తరహాలోనే వన్డే సిరీస్‌లోనూ టీమిండియా తన జోరు కొనసాగిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుపతి జిల్లాలో మాజీ మంత్రి రోజా హంగామా.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు
మత్తుమందు ఇచ్చి లైంగిక దాడులు! కేరళ డాక్టర్ కేసు కొత్త మలుపు
'ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది'.. బీజేపీపై సోనియా విమర్శలు