ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:03 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అతడు 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ ఆజట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ(శనివారం)న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అతడు 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం ప్లేయర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాంటింగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా అతడిని అధికమించి.. విరాట్ తొలిస్థానంలో నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వెల్లింగ్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియా బౌలర్ల దెబ్బకు 134 పరుగులకే (41 ఓవర్లు) కుప్పకూల్చింది. గుర్నూర్ బ్రార్ 4,అక్షర్ పటేల్, అన్షుల్ కంబోజ్, ఆకిబ్ నబీ తలో 2 వికెట్లు తీసి కివీస్ జట్టును దారుణంగా దెబ్బ కొట్టారు. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (55) మాత్రమే అర్ద శతకంతో రాణించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కూడా తడబడుతుంది. మరోసారి వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. 26 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. మరోసారి వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు
విరాట్ కోహ్లి- 1976
రికీ పాంటింగ్- 1971
సచిన్ టెండూల్కర్- 1750
కుమార సంగక్కర- 1568
సనత్ జయసూర్య- 1519
జాక్ కల్లిస్- 1449
ఇవి కూడా చదవండి:
చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్
ఆసీస్ ప్లేయర్లందరికీ తెలుసు.. శాండ్‌పేపర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు
షమీకి మరొక్క అవకాశమైనా ఇవ్వాల్సింది.. బీసీసీఐపై రవి శాస్త్రి అసంతృప్తి