మత్తుమందు ఇచ్చి లైంగిక దాడులు! కేరళ డాక్టర్ కేసు కొత్త మలుపు
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:53 PM
అత్యవసర వైద్యం పేరుతో ఫ్లాట్‌కు రప్పించి డాక్టర్‌ను చితకబాది దోపిడీ చేసిన కేసు కొత్త మలుపు తీసుకుంది. తనపై నటులు అతుల్య చంద్ర, బిబిన్ పెరుంబిలి దాడిచేసి రూ.3.5 లక్షల విలువైన వస్తువులు లాక్కున్నారని ఫిర్యాదు చేసిన డాక్టర్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతడి ఫోన్‌లో 10 మందికి పైగా మహిళలకు సంబంధించిన వీడియోలు లభించినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: అత్యవసర వైద్యం పేరుతో ఫ్లాట్‌కు రప్పించి డాక్టర్‌ను చితకబాది దోపిడీ చేసిన కేసు కొత్త మలుపు తీసుకుంది. తనపై నటులు అతుల్య చంద్ర, బిబిన్ పెరుంబిలి దాడిచేసి రూ.3.5 లక్షల విలువైన వస్తువులు లాక్కున్నారని ఫిర్యాదు చేసిన డాక్టర్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతడి ఫోన్‌లో 10 మందికి పైగా మహిళలకు సంబంధించిన వీడియోలు లభించినట్లు సమాచారం. వారిలో అతడి వద్దకు వైద్యం కోసం వచ్చిన మహిళలు, వారి బంధువులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న నటి బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ వైద్యుడిపై అత్యాచారం కేసు నమోదైంది. తనకు మద్యం, మత్తు మందులు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇన్ఫోపార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆమె అంతకుముందే ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలు ఈ కేసును మరో మలుపు తిప్పాయి. వైద్యుడి ఫోన్‌లో లభించిన వీడియోల్లోని మహిళల వివరాలను గుర్తించడంతో పాటు, వారిపై లైంగిక నేరాలు జరిగాయా? అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మద్యం మాత్రమే కాకుండా సైకోట్రోపిక్ అనే మందులు కూడా ఇచ్చి మహిళలను స్పృహ లేకుండా చేసి అతను లైంగిక దాడులకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
కాగా.. పోలీసులు శుక్రవారం డాక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అత్యాచారం కేసు నమోదైనప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్‌లో లభించిన డేటా ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. ఈనెల 2న కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో తనపై దాడి చేసి రూ.3 లక్షల విలువైన తన రెండు మొబైల్ ఫోన్లతో పాటు ఇతర వస్తువులను దోచుకున్నారని డాక్టర్ చేసిన ఫిర్యాదుపై నటి అతుల్య చంద్ర, నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..
అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత