అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:11 PM
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా పనిచేస్తున్న హ్యారీ బాక్సర్ అలియాస్ హరిచంద్ జాట్‌ను అమెరికాలో అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో అమెరికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా పనిచేస్తున్న హ్యారీ బాక్సర్ అలియాస్ హరిచంద్ జాట్‌ను అమెరికాలో అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో అమెరికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అందించిన సమాచారంతో అతడిని అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని, అమెరికా నుంచి అతను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. అలాగే బాలీవుడ్ నటులను చాలా మంది అతను సోషల్ మీడియా, ఆడియో మెసేజీలలో బెదిరించాడని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని జుహు ప్రాంతంలో ఫిల్మ్‌మేకర్ రోహిత్ శెట్టి నివాసంపై జరిగిన కాల్పుల్లో తన హస్తం ఉందని బాక్సర్ ప్రకటించాడు. అలాగే, నటుడు తుషార్ కపూర్‌ను ఒక ఆడియోలో బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ ఆడియోలో ఉన్న గొంతు బాక్సర్ది కాదని అధికారులు చెప్పారు.
బాక్సింగ్ నుంచి నేర సామ్రాజ్యంలోకి
హ్యారీ బాక్సర్ అసలు పేరు హరిచంద్ జాట్. అతనిది రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లా. జైపూర్‌లో ఉన్నపుడు బాక్సింగ్ నేర్చుకున్నాడు. దీంతో అతనికి బాక్సర్ అనే పేరు వచ్చింది. అలాగే కొన్నాళ్లపాటు బాక్సింగ్ కోచ్‌గా పనిచేశాడు. వివిధ పోటీ పరీక్షలకూ ప్రిపేర్ అయ్యాడు. తర్వాత నేర ప్రపంచంలోకి ప్రవేశించాడు. అయితే అతను విదేశాలకు ఎప్పుడు వెళ్లాడో స్పష్టమైన సమాచారం లేదు. విదేశాల్లో ఉంటూనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలకంగా పనిచేస్తున్నాడు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో జరిగిన వివిధ నేరాల్లో అతని హస్తం ఉంది. అలాగే కెనడాలోని కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెఫే పైనా కాల్పుల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. అతడిని త్వరలో భారత్‌కు తీసుకురానున్నారు.
ఇవీ చదవండి:
60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!
ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన