Share News

మహ్మద్ షమీ రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురైన మోర్నె మోర్కెల్

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:38 PM

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. షమీ నిర్ణయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ స్పందిస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు.

మహ్మద్ షమీ రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురైన మోర్నె మోర్కెల్
Mohammed Shami

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి సమయంలో సోషల్ మీడియా వేదికగా అతడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. షమీ నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్లు స్పందించారు. తాజాగా భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ స్పందిస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు. జట్టులో షమీ ప్రభావం, డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు అందించిన మద్దతును ఈ సందర్భంగా మోర్కెల్ గుర్తుచేసుకున్నారు.


'నేను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో షమీతో పనిచేయడం అదృష్టంగా భావించాను. అతను అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో కలిసిపోయే మంచి వ్యక్తి. భాష విషయంలోనూ అతను నాకు ఎంతో సహాయపడ్డాడు. షమీ రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరం. అయితే అతను దేశవాళీ క్రికెట్‌లో ఇంకా బౌలింగ్ చేస్తుండటం సంతోషంగా ఉంది' అని మోర్కెల్ పేర్కొన్నారు.


భారత్ తరఫున 64 టెస్టులాడిన మహ్మద్ షమీ మొత్తం 229 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఆరు సార్లు ఫైవ్ వికెట్ హాల్‌ను సాధించడం.. అతడి స్థిరమై బౌలింగ్ ప్రదర్శనకు నిదర్శనం. భారత పేస్ దళంలో కీలక అస్త్రంగా వ్యవహరించిన షమీ టెస్టులకు అకస్మాత్తుగా వీడ్కోలు పలకడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


ఈ వార్తలు కూడా చదవండి

తిరుపతి జిల్లాలో మాజీ మంత్రి రోజా హంగామా.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు

మత్తుమందు ఇచ్చి లైంగిక దాడులు! కేరళ డాక్టర్ కేసు కొత్త మలుపు

'ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది'.. బీజేపీపై సోనియా విమర్శలు

Updated Date - Nov 07 , 2026 | 04:38 PM