రంజీ ట్రోఫీకి బిహార్ జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:36 PM
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం అన్ని రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు క్రికెట్ సంఘాలు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా బిహార్ క్రికెట్ అసోషియేషన్(బీసీఏ) 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం అన్ని రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు క్రికెట్ సంఘాలు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా బిహార్ క్రికెట్ అసోషియేషన్(బీసీఏ) 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే ఇది తొలి రెండు మ్యాచుల కోసమే. బీసీసీఐ నియమించిన పరిశీలకుల ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా ఈ జట్టు ఎంపిక జరిగింది. ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరపున బిజీగా ఉన్నాడు. ఈ కారణంతోనే బిహార్ క్రికెట్ అసోషియేషన్ వైభవ్‌ను జట్టులోకి తీసుకోలేదు. గత సీజన్‌లో వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి అతడు బాధ్యతలను హిమాన్షు సింగ్‌కు అప్పగించారు. అదేవిధంగా మరోసారి బిహార్ జట్టును ముందుండి నడిపించేందుకు ఆల్‌రౌండర్ సకీబుల్ ఘని సిద్ధమయ్యాడు.
రంజీ ట్రోఫీ జట్టు కోసం ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను బీసీసీఐ నామినేటెడ్ సెలెక్టర్లైన హర్విందర్ సింగ్, ఎస్.శరత్, అమితాబ్ విజయవర్గియాల పర్యవేక్షణలో నిర్వహించారు. సకీబుల్ ఘని సారథ్యంలోని బిహార్ జట్టు అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. కొత్తగా నిర్మించిన 'రాజ్‌గిర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం' వేదికగా జరగనున్న ఈ పోరు బిహార్ చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ మైదానంలో జరుగుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇదే కావడం విశేషం.
బిహార్ రంజీ జట్టు:
సకీబుల్ ఘని (కెప్టెన్), హిమాన్షు సింగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ లోహరుకా, మంగళ్ మహ్రూర్, నమన్ గౌరవ్, పీయూష్ సింగ్, బిపిన్ కుమార్ సౌరభ్ (వికెట్ కీపర్), శర్మన్ నిగ్రోధ్ (వికెట్ కీపర్), ఆకాశ్ రాజ్, పృథ్వీ రాజ్, ఖాలిద్ ఆలం, సూరజ్ కుమార్ కశ్యప్, షకీబ్ హుస్సేన్, ఎండి ఇజార్, షబ్బీర్ ఖాన్, రాఘవేంద్ర సింగ్, ఆమోద్ యాదవ్.
స్టాండ్‌బై ఆటగాళ్లు:
నవాజ్ ఖాన్, మలయ్ రాయ్, దానిష్ ఆలం, తను కుమార్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, ప్రశాంత్ కుమార్ సింగ్.
సహాయక సిబ్బంది:
ప్రధాన కోచ్: అశుతోశ్ అమన్; సహాయ కోచ్: అశోక్ కుమార్; ఫిజియోథెరపిస్ట్: డా. హేమెందు; శిక్షకుడు: గోపాల్ కుమార్.
ఇవి కూడా చదవండి:
మెస్సికి రొనాల్డో భావోద్వేగ వీడ్కోలు.. ‘ఫుట్‌బాల్ చరిత్రలో నీ పేరు శాశ్వతం’
భువిపై ఎవరూ దయ చూపలేదు.. అది అతడి అర్హత: వసీం జాఫర్