విజయంతో.. మెస్సీ వీడ్కోలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:41 AM
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (39) దేశం తరపున తన వీడ్కోలు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించాడు. స్వయంగా..
ఆఖరి మ్యాచ్‌లో అలరించిన లియోనెల్
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (39) దేశం తరపున తన వీడ్కోలు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించాడు. స్వయంగా ఓ గోల్ చేయడమే కాకుండా.. రెండు గోల్స్‌కు బాటలు వేశాడు. బెనిన్‌తో జరిగిన ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో గెలిచింది. రెండు దశాబ్దాలపాటు జాతీయ జట్టుకు ఆడిన మెస్సీకి వీడ్కోలు పలికేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. సుదీర్ఘ కెరీర్‌లో 126 గోల్స్‌తోపాటు 2022లో వరల్డ్ కప్, రెండు కోపా అమెరికా కప్‌లు నెగ్గాడు. ‘రెండు దశాబ్దాలపాటు అర్జెంటీనా జెర్సీని ధరించినందుకు గర్వంగా ఉంది. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నా. ఇక నుంచి మీవైపు ఉంటా. ఐకమత్యమే మన బలం’ అని మెస్సీ ప్రసంగించాడు. లియోనెల్‌ను చూసి ఫ్యాన్స్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఓలే ఓలే మెస్సీ’ అంటూ స్టేడియాన్ని మార్మోగించారు. ఈ ఏడాది ఆగస్టు 31నే మెస్సీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తన దేశం తరపున కెరీర్‌లో చివరి మ్యాచ్ సందర్భంగా మెస్సీకి బ్యూనస్ ఎయిర్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి