కెప్టెన్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. బీసీఏ కీలక నిర్ణయం!
ABN , Publish Date - Nov 06 , 2026 | 09:12 PM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బిహార్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఈ మేరకు బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. వైభవ్‌కి డిప్యూటీగా సూరజ్ కశ్యప్‌ను బీసీఏ ఎంపిక చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 కోసం బిహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు గానూ టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బిహార్ సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. 15 ఏళ్లకే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి.. ఈ చిచ్చర పిడుగు అరుదైన ఘనతను సాధించాడు.
నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో బీహార్ తన ఆరంభ మ్యాచ్‌లో సౌరాష్ట్రతో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 16న రైల్వేస్‌తో మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం వైభవ్ భారత టీ20 తుది జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ ఆడాడు. ఆ తర్వాత మ్యాచులకు అతడిని మేనేజ్మెంట్ బెంచ్‌కు పరిమితం చేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వైభవ్‌కు కెప్టెన్సీ బాధ్యత అనేది అతడి కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది. ఇక ఈ జట్టుకు సూరజ్ కశ్యప్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ బీసీఏ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా బిహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 'వైభవ్ చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పరిణతి కనబరిచాడు. ఈ బాధ్యత అతనికి ఒక ఆటగాడిగా, నాయకుడిగా మరింతగా ఎదిగేందుకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది' అని తెలిపాడు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్న వైభవ్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం క్రీడా వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:
రూ.14.20 కోట్ల ఆటగాడిని వదులుకోవద్దు.. సీఎస్కేకు ఇర్ఫాన్ పఠాన్ సలహా!
తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో షాక్.. దీపావళి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
కర్ణాటక బీజేపీ వినూత్న నిరసన.. ఏఐ వీడియోతో కాంగ్రెస్‌పై విమర్శలు!