Share News

రూ.14.20 కోట్ల ఆటగాడిని వదులుకోవద్దు.. సీఎస్కేకు ఇర్ఫాన్ పఠాన్ సలహా!

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:53 PM

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు నవంబర్ 17తో రిటెన్షన్, ట్రేడ్ విండో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ కసరత్తును వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు.

రూ.14.20 కోట్ల ఆటగాడిని వదులుకోవద్దు.. సీఎస్కేకు ఇర్ఫాన్ పఠాన్ సలహా!
Prashant Veer

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు నవంబర్ 17తో రిటెన్షన్, ట్రేడ్ విండో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ కసరత్తును వేగవంతం చేశాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిపిన భారీ ట్రేడింగ్ ద్వారా లియామ్ లివింగ్‌స్టన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే రిటెన్షన్ విషయంలో సీఎస్కే మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.


ఓ స్పోర్ట్స్ ఛానల్ వీడియోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. 'గతేడాది వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 14.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యువ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్‌ను ఫ్రాంచైజీ అంటిపెట్టుకోవాలి. గత సీజన్‌లో ప్రశాంత్ వీర్‌కు బ్యాటింగ్, బౌలింగ్‌లో తగినన్ని అవకాశాలు రాలేదు. భారీ ధర పలికినప్పటికీ ఆశించిన స్థాయిలో మ్యాచ్‌లు ఆడని కారణంగా ప్రశాంత్ వీర్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, అతనిలో అద్భుతమైన ఆల్ రౌండ్ నైపుణ్యాలు ఉన్నాయి. అతనికి మరో సీజన్ అవకాశం ఇవ్వాలి' అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.


మరోవైపు రూ. 14.20 కోట్లకు అమ్ముడైన మరో ఆటగాడు కార్తీక్ శర్మ. అతడు గత సీజన్ ఆఖరిలో అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నాడు. దీంతో కార్తీక్ శర్మను కూడా సీఎస్కే రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. అయితే, రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసిన లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను మాత్రం చెన్నై ఈసారి విడుదల చేయడం మంచిదని ఇర్ఫాన్ పఠాన్ సలహా ఇచ్చాడు. మరి సీఎస్కే మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

నా భార్య క్యాన్సర్ పోరాటం.. నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ ప్లేయర్

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!

Updated Date - Nov 06 , 2026 | 08:00 PM