Share News

తండ్రికి తగ్గ తనయుడు..సెహ్వాగ్ కొడుకు విధ్వంసం!

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:42 PM

అండర్‌-19 ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం సృష్టించాడు. ఆర్యవీర్‌ 129 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

తండ్రికి తగ్గ తనయుడు..సెహ్వాగ్ కొడుకు విధ్వంసం!
Aryavir Sehwag

స్పోర్ట్స్ డెస్క్: అండర్‌-19 ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం సృష్టించాడు. ఆర్యవీర్‌ 129 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 52 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


ఆర్యవీర్ మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి బ్యాటింగ్‌ను తలపిస్తూ సిక్సర్‌తో తన తొలి అండర్‌-19 అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అతడితో పాటు కెప్టెన్‌ లక్ష్య రాజేశ్ రాయచందాని(53) అజేయ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం 19.1 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా చేధించింది. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో నేపాల్‌ జట్టు 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది.


ఆర్యవీర్ విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత క్రికెట్ అభిమానులు, సెహ్వాగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. తండ్రికి తగ్గ తనయుడని కొందరు అంటే.. తండ్రికి మించిన తనయుడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో దేశావాళీ టోర్నీ మన్కడ్ ట్రోఫీలో 143 బంతుల్లోనే 173 పరుగులు బాది కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ జట్టుకు భారీ స్కోరు అందించాడు. అలానే ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున కూడా ఆర్యవీర్ ఆడాడు. ఇలా దేశవాళీ టోర్నీల్లో ఆడిన అనుభవం ఆర్యవీర్ సెహ్వాగ్‌కు ఎంతగానో ఉపయోగపడింది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!

ఎస్‌ఈటీఎల్‌ లాభంలో 38 శాతం వృద్ధి

Updated Date - Nov 06 , 2026 | 04:48 PM