నా భార్య క్యాన్సర్ పోరాటం.. నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ ప్లేయర్
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:46 PM
రెండేళ్ల క్రితం తన భార్య క్యాన్సర్‌తో పోరాడిన తీరు తన జీవిత దృక్పథాన్ని మార్చిందని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ అన్నాడు. ఆమె పోరాటం కారణంగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒత్తిడిని ఇప్పుడు జయించానని వెల్లడించాడు.
స్పోర్ట్స్ డెస్క్: రెండేళ్ల క్రితం తన భార్య క్యాన్సర్‌తో పోరాడిన తీరు తన జీవిత దృక్పథాన్ని మార్చిందని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ అన్నాడు. ఆమె పోరాటం కారణంగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒత్తిడిని ఇప్పుడు జయించి.. క్రికెట్‌ను ఆస్వాదించడంపై దృష్టి పెడుతున్నానని అతడు వెల్లడించాడు. తన సతీమణి 2024లో క్యాన్సర్ బారిన పడిందని, 8 నెలల పాటు చికిత్స తీసుకుందని తెలిపాడు. టిక్నర్ తన జీవితానికి భార్య సారానే హీరోనని చెప్పుకొచ్చాడు.
రెండో వన్డేకు ముందు టిక్నర్ మీడియాతో మాట్లాడుతూ... 'నా జీవితంలోనూ ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఈ కష్ట కాలంలో నా భార్య సారా, నాకు, నా కుటుంబం అండగా నిలిచింది. ఇప్పుడు నేను మళ్లీ నా క్రికెట్‌ను ఆస్వాదించడానికి కారణం ఆమె. కెరీర్ ప్రారంభంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. ఆ తర్వాత సారా క్యాన్సర్ చికిత్స సమయంలోనూ చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఆ దశను దాటి వచ్చాను. ఇప్పుడు క్రికెట్‌ను సరదాగా ఆడుతూ ఆస్వాదించాలనుకుంటున్నాను' అని తెలిపాడు.
'క్రికెట్ నా జీవితంలో కీలకమైన భాగమే. కానీ అదే నా సర్వస్వం కాదనే విషయాన్ని తెలుసుకున్నాను. క్రికెట్ కంటే కుటుంబం, నా వ్యక్తగత జీవితం పెద్దదనే విషయాన్ని గ్రహించాను. మ్యాచ్ ముగిసిన తర్వాత నా కూతురు, నా సతీమణి కోసం ఇంటికి వెళ్లడం కంటే ఆనందం మరొకటి లేదు. అందుకే క్రికెట్‌కు కాస్త ప్రాధాన్యం తగ్గించాను' అని టిక్నర్ పేర్కొన్నాడు. భారత్‌తో తొలి వన్డేలో టిక్నర్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చి నాలుగు సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే.
టిక్నర్ 2019లో టీ20లలో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేయగా, ఆ తర్వాత వరుసగా 2022, 2023లో వన్డే, టెస్ట్ జట్లకు కూడా ఎంపికయ్యాడు. 2024 ఏప్రిల్‌లో టిక్నర్ భార్య సారాకు లుకేమియా ఉన్నట్లు తెలిసింది. ఆమె ఎనిమిది నెలల పాటు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంది. ఆ సమయంలో టిక్నర్ వ్యక్తిగతంగా పరిస్థితులు కష్టంగా మారాయి. టిక్నర్ ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో 19 మ్యాచ్‌లు ఆడాడు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..
బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!
ఎస్ఈటీఎల్ లాభంలో 38 శాతం వృద్ధి