Share News

గంగూలీ పర్సనాలిటీ హక్కుల ఉల్లంఘన.. ‘దూస్రా’ సినిమాకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:37 PM

టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించి 'దూస్రా' సినిమాపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రంలో తన వ్యక్తిగత గుర్తింపును వాణిజ్యపరంగా దుర్వినియోగం చేశారంటూ గంగూలీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

గంగూలీ పర్సనాలిటీ హక్కుల ఉల్లంఘన.. ‘దూస్రా’ సినిమాకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
Sourav Ganguly

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించి 'దూస్రా' సినిమాపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రంలో గంగూలీ వ్యక్తిగత గుర్తింపును, పర్సనాని వాణిజ్యపరంగా దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఆయనతో పాటు 'లవ్ ఫిలింస్ ఎల్‌ఎల్‌పి'(ఈ సంస్థ గంగూలీ బయోపిక్‌ను నిర్మిస్తోంది) కోర్టును ఆశ్రయించాయి.


ఈ వ్యాజ్యంపై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిపిన జస్టిస్ తేజస్ కరియా.. 'దూస్రా' మూవీ ప్రాథమికంగా గంగూలీ పర్సనాలిటీ హక్కులను ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. ఈ సినిమా కేవలం చారిత్రక సంఘటనల చిత్రీకరణకే పరిమితం కాలేదని, వాణిజ్యపరంగా గంగూలీ ఇమేజ్‌ను వాడుకున్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ప్రదర్శనపై మాత్రం జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.


దూస్రా సినిమా ప్రదర్శనను నిలిపివేయడానికి నిరాకరించినప్పటికీ చిత్ర నిర్మాణ సంస్థకు కొన్ని కఠిన షరతులు విధించింది. సినిమాలో తగిన ప్రకటనను జోడించాలని, అలాగే రూ. 2 కోట్ల బ్యాంకు గ్యారెంటీని సమర్పించాలని ఆదేశించింది. అభినయ్ డియో దర్శకత్వం వహించిన 'దూస్రా: ఇండియాస్ అదర్ ఫ్రీడమ్ స్ట్రగుల్' మూవీలో ప్లాబితా బోర్తాకుర్, అంకుర్ వికల్, సమిధా గురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదల కంటే ముందు కూడా పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. తాజా ఉత్తర్వులతో ఈ వివాదం క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!

ఎస్‌ఈటీఎల్‌ లాభంలో 38 శాతం వృద్ధి

Updated Date - Nov 06 , 2026 | 05:43 PM