Share News

3 గంటల్లో 1000 బంతులు.. సూర్యకుమార్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:41 PM

టీమిండియా కెప్టెన్‌గా టీ20 ప్రపంచ కప్‌ను అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు.. ఇప్పుడు జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోవడంతో అతడిపై వేటు పడింది.

3 గంటల్లో 1000 బంతులు.. సూర్యకుమార్ ప్రాక్టీస్ వీడియో వైరల్!
Suryakumar Yadav

స్పోర్ట్స్ డెస్క్: జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడమే లక్ష్యంగా టీమిండియా టీ20 మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై ఎలాంటి బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయకుండా, తన ఆటకు మరింత పదును పెట్టడంపైనే సూర్య దృష్టంతా నిలిపాడు.


ఈ క్రమంలో ముంబైలోని వాసూ పరాంజపే క్రికెట్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందుతున్న వీడియోలను అతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. '3 గంటల్లో1000 బంతులు ఎదుర్కొని సాధన చేశాను. చాలా సంతృప్తిగా అనిపించింది' అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సూర్య 3 గంటల్లో 1000 బంతులను ఎదుర్కొన్నాడంటే.. నిమిషానికి కనీసం ఐదు బంతులను ఆడటం గమనార్హం. మొత్తంగా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తాను జట్టులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలియజేసేలా ఈ పోస్ట్ ఉందంటూ క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


2024లో భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందించిన సూర్యకుమార్, వ్యక్తిగతంగా ఆశించిన స్థాయిలో రాణించలేదు. అలానే ఐపీఎల్ సైతం సూర్య ప్రదర్శన సరిగా లేకపోవడంతో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో నూతన జట్టును నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. అయినప్పటికీ భారత్ తరఫున మళ్లీ ప్రాతినిధ్యం వహించే ఆశలను తాను వదులుకోలేదని, జట్టులోకి పునరాగమనం చేస్తానని సూర్య ఈ తీవ్ర శిక్షణ ద్వారా స్పష్టం చేస్తున్నాడు. సూర్య నెట్ ప్రాక్టీస్ వీడియోను మీరు చూసేయండి.


ఇవి కూడా చదవండి:

పాక్‌పై సాధించిన నా విజయం కార్గిల్ వీరులకు అంకితం: జాదుమణి

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్

Updated Date - Jul 27 , 2026 | 02:54 PM