Share News

తండ్రైన టీమిండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్

ABN , Publish Date - May 07 , 2026 | 08:01 PM

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతని భార్య దేవిశా శెట్టి ఇవాళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

తండ్రైన టీమిండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్
Surya Kumar Yadav

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతని భార్య దేవిశా శెట్టి ఇవాళ(గురువారం) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ దంపతులు ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ మధుర క్షణాలను సూర్య దంపతులు ఆస్వాదిస్తున్నారు. పలువురు సోషల్ మీడియా ద్వారా సూర్యకు అభినందలు తెలియజేస్తున్నారు.


దేవిశాని సూర్యకుమార్ యాదవ్‌ 2016లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు ఓ మ్యూచవల్ ఫ్రెండ్ ద్వారా పరిచయమై.. ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లై 10 ఏళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు కావడంతో ఇరుకుటుంబాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కెప్టెన్‌గా సూర్య కుమార్ టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే.


తాజాగా కూతురు జన్మించడంతో సూర్యకుమార్ కుటుంబంలో హ్యాపీనెస్ డబులైంది. తండ్రి కావడంతో సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబంతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 10న రాయ్‌పుర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదని సమాచారం. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 195 పరుగులే చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

Updated Date - May 07 , 2026 | 08:12 PM