Share News

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

ABN , Publish Date - May 07 , 2026 | 05:57 PM

ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగే వేదికను బీసీసీఐ మార్చిన సంగతి తెలిసిందే. ఈనెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పందించారు.

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
PL 2026 final venue change

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగే వేదికను బీసీసీఐ మార్చిన సంగతి తెలిసిందే. ఈనెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆర్‌సీబీతో సహా, కర్ణాటక క్రికెట్ సంఘం, అభిమానులకు షాకయ్యారు. తాజాగా వేదిక మార్పుపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు.


గురువారం కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ను బెంగళూరు నుంచి తరలించడానికి భద్రతాపరమైన కారణాలు కాదని ఆయన తెలిపారు. స్టేడియం సామర్థ్యానికి సంబంధించిన వాణిజ్యపరమైన అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పరమేశ్వర అభిప్రాయపడ్డారు. బెంగళూరు మైదానంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, ఐపీఎల్ అధికారులు లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎలాంటి ఆందోళనలు వ్యక్తం చేయలేదని అన్నారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) ఐపీఎల్ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫైనల్‌ మ్యాచ్ ను బెంగళూరుకు కేటాయించలేదని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర చెప్పారు.


'నాకు అందిన అనధికారిక సమాచారం ప్రకారం.. చిన్నస్వామి స్టేడియంలో కేవలం 33,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో 7,000 నుంచి 8,000 సీట్లను స్పాన్సర్లు, ఇతరులకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో కేవలం 25,000 సీట్లు మాత్రమే మిగిలిపోతున్నాయి. అందువల్ల, ఇది వాణిజ్యపరంగా లాభదాయకం కాకపోవచ్చు. అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు' అని జి. పరమేశ్వర అన్నారు.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

విమానంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన చాహల్!

Updated Date - May 07 , 2026 | 06:00 PM