విమానంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన చాహల్!
ABN , Publish Date - May 07 , 2026 | 04:28 PM
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ ప్లేయర్ యజ్వేంద్ర చాహల్ వివాదంలో చిక్కుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బీసీసీఐ (BCCI), నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. తాజాగా పంజాబ్ ప్లేయర్ యజ్వేంద్ర చాహల్ వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు పంజాబ్ కింగ్స్ జట్టుతో ప్రయాణిస్తున్నప్పుడు చాహల్ వేప్ వాడుతున్నాడని కొందరు నెటిజన్లు ఆరోపించారు. అంతేకాక అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి స్క్రీన్‌షాట్‌లు, క్లిప్‌లను కూడా నెట్టింట షేర్ చేశారు. చాహల్ వేపింగ్ చేస్తున్న భాగాన్ని ఎడిట్ చేసి.. వీడియోను కుదించారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై చాహల్ నుంచి కానీ, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు.
ఇవి కూడా చదవండి:
తీవ్రమైన డిప్రెషన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా