Share News

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా

ABN , Publish Date - May 07 , 2026 | 02:30 PM

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ-2027కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా
Border-Gavaskar Trophy 2027

స్పోర్ట్స్ డెస్క్: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌(Border-Gavaskar Trophy) ట్రోఫీ-2027కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాది జనవరి 21న తొలి టెస్ట్‌ నాగ్‌పూర్‌ వేదికగా జరుగనుంది.


అనంతరం రెండో టెస్టు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు చెన్నై వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 11 నుండి 15 వరకు గువహటి వేదికగా మూడో టెస్ట్‌.. ఫిబ్రవరి 19 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్‌ జరగనుంది. ఇక ఐదో టెస్ట్ ఫిబ్రవరి 27 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతుంది. కాగా, బోర్డర్‌​ గవాస్కర్‌ ట్రోఫీ 2027 తేదీల ప్రకటనతో పాటు భారత పర్యటనలోని మరిన్ని సిరీస్‌ల వివరాలను కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. బీజీటీ 2027కు ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత-ఏ జట్టుతో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ ఆడనుంది.


ఆస్ట్రేలియా-ఏతో సిరీస్

  • సెప్టెంబర్ 22- ఫస్ట్ ఫోర్ డే మ్యాచ్ (పుదుచ్చేరి)

  • సెప్టెంబర్ 29- సెకండ్ ఫోర్ డే మ్యాచ్ (పుదుచ్చేరి)

  • అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)

  • అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)

  • అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)


అండర్-19 జట్టు సిరీస్‌

భారత అండర్‌-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే(నాలుగు రోజులు) మ్యాచ్‌లు ఆడనుంది.

  • సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్‌కోట్)

  • సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్‌కోట్)

  • సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్‌కోట్)

  • సెప్టెంబర్ 27- ఫస్ట్ ఫోర్ డే మ్యాచ్ (రాజ్‌కోట్)

  • అక్టోబర్ 5- సెకండ్ ఫోర్ డే మ్యాచ్ (అహ్మదాబాద్)


ఇవి కూడా చదవండి:

నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి.. పంజాబ్ కింగ్స్‌పై ఇషాన్ కిషన్ సెటైర్..

టాప్‌ లేపిన రైజర్స్‌

Updated Date - May 07 , 2026 | 03:15 PM