Share News

ఈడీ సోదాలు.. భవనం పైనుంచి పడేసిన డబ్బు సంచులు..?

ABN , Publish Date - May 07 , 2026 | 01:10 PM

మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా నోట్ల కట్టలతో నిండిన సంచులు దొరికినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం.

ఈడీ సోదాలు.. భవనం పైనుంచి పడేసిన డబ్బు సంచులు..?
ED Raids in Punjab

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు (గురువారం) సోదాలు నిర్వహించారు. భూ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణల కేసుల్లో భాగంగా ఈడీ దాడులు చేసింది. కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సన్‌టెక్ సిటీ ప్రాజెక్ట్, అజయ్ సెహగల్, ఏబీఎస్ టౌన్‌షిప్స్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్‌స్ట్రక్షన్స్ సహా అనుబంధ సంస్థలకు చెందిన ఆఫీసులపై దాడులు చేశారు.


అయితే, మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా నోట్ల కట్టలతో నిండిన సంచులు దొరికినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం. నేలపై నోట్ల కట్టలు పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నగదుకు భూ కుంభకోణం కేసుతో సంబంధం ఉందా, లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు నగదు సంచులు దొరికినట్లు ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఆ వీడియోలను ఎస్ఏడీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈడీ దాడుల సందర్భంగా నగదును ఇలా పడేశారంటూ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.


మరోవైపు నితిన్ గోహల్ అనే వ్యక్తి కోసం ఈడీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(GMADA)కి ఫీజులు చెల్లించడంలో విఫలమైన బిల్డర్లకు గోహల్ రాజకీయ రక్షణ కల్పించాడని ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఓఎస్డీ రాజ్‌బీర్ ఘుమన్‌తో గోహల్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతనిపై GMADA నుంచి భూ వినియోగ మార్పు లైసెన్సులు పొందడంలో మోసానికి పాల్పడడం, పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయల నిధులు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్..

తమిళనాడు బద్ద శత్రవులు కలుస్తారా.. ఏడీఎంకే ఆఫర్‌పై డీఎంకే స్పందన ఏంటంటే..

Updated Date - May 07 , 2026 | 01:15 PM