తమిళనాడు బద్ద శత్రవులు కలుస్తారా.. ఏడీఎంకే ఆఫర్‌పై డీఎంకే స్పందన ఏంటంటే..
ABN , Publish Date - May 07 , 2026 | 12:18 PM
తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే పార్టీల మధ్య శత్రుత్వం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. కరుణానిధిపై కోపంతోనే నటుడు ఎమ్జీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి ఆ రెండు పార్టీల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది.
తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే పార్టీల మధ్య శత్రుత్వం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. కరుణానిధిపై కోపంతోనే నటుడు ఎమ్జీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి ఆ రెండు పార్టీల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. అన్నాడీఎంకే జయలలిత చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ శత్రుత్వం మరింత పెరిగింది. అయితే తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రెండు పార్టీలను దగ్గర చేశాయని పరిశీలకులు భావిస్తున్నారు (DMK AIADMK alliance).
తమిళనాడులో విజయ్‌కు చెందిన 'టీవీకే' అత్యధిక స్థానాలు గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాలేదు. మరో పది సీట్ల మద్దతు దొరికితేనే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఈ నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు డీఎంకేకు అన్నాడీఎంకే ఓ ప్రతిపాదన కూడా పంపిందట. అయితే ఆ ఆఫర్‌ను డీఎంకే తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. డీఎంకేతో చర్చలు జరిగాయనే వార్తలను అన్నాడీఎంకే ఖండించలేదు (Vijay majority struggle).
కాగా, తమిళనాడు నూతన ప్రభుత్వం గురించి డీఎంకే అధినేత స్టాలిన్ (MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీకే గనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము అస్థిరపరిచే ప్రయత్నం చేయబోమని, ఆరు నెలలు పరిస్థితిని గమనిస్తామని స్టాలిన్ తెలిపారు. ప్రజల తీర్పును గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభాన్ని కాని, మరోసారి ఎన్నికలను కాని తాను కోరుకోవడం లేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..