పశ్చిమబెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ రద్దు
ABN , Publish Date - May 07 , 2026 | 07:25 PM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం రద్దు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో.. గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోల్‌కతా, మే 07: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం రద్దు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో.. గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్‌లో శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అసెంబ్లీ రద్దుతో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ రవి బర్తరఫ్ చేసినట్లు అయింది.
294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మే 4వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని బీజేపీకి ఓటర్ కట్టబెట్టాడు. దీంతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన మెజార్టీ ఓటర్ ఇచ్చారు.
దీంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు ముహూర్తం ఖరారు చేశారు. మే 9వ తేదీ ఉదయం10 గంటలకు ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య ప్రకటించారు.
మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిపై పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఘన విజయం సాధించిన సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.
ఇంకోవైపు ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు విలన్ ఈసీ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ ఆమె భీష్మించుకున్నారు.
బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి నేటితో (గురువారం) ముగియనుంది. అయినా సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో గత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest National News And Telugu News