Share News

జింబాబ్వే కెప్టెన్ సికందర్‌ రజా సంచలన నిర్ణ‌యం

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:43 PM

జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ ర‌జా సంచలన నిర్ణ‌యం తీసుకున్నాడు. వచ్చే ఏడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు.

జింబాబ్వే కెప్టెన్ సికందర్‌ రజా సంచలన నిర్ణ‌యం
Sikandar Raza Retirement

స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ ర‌జా సంచలన నిర్ణ‌యం తీసుకున్నాడు. వచ్చే ఏడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికా, నమీబియాలతో పాటు జింబాబ్వే కూడా 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో రజా సొంత ప్రేక్షకుల ముందు తన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది. రజా 2013లో జింబాబ్వే త‌రఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అంతేకాక జింబాబ్వే తరఫున అంత‌ర్జాతీయ టీ20ల్లో సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు.


ఓ క్రికెట్ కార్యక్రమంలో సికందర్ రజా మాట్లాడుతూ .. 'ప్రతి క్రికెట‌ర్ ప్ర‌పంచక‌ప్ ఆడిన త‌ర్వాత రిటైర్ అవ్వాల‌ని కోరుకుంటారు. నేను క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చంది. స్వ‌దేశంలో జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడే అవ‌కాశం ల‌భించ‌డం వ్య‌క్తిగ‌తంగా నాకు గొప్ప అవకాశం. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ఆలోచన ఎంతమాత్రం లేదు' అని తెలిపాడు.


'2027-30 సైకిల్‌లో ప్ర‌పంచ‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టోర్నీలో జింబాబ్వే జట్టు ప్రవేశించిన‌ప్ప‌టికీ, నేను తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయంలో మార్పు ఉండదు. అయితే డ‌బ్ల్యూటీసీ టోర్నీలో జింబాబ్వే ఆడ‌టాన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తాను. టెస్టుల్లో మేము అంత‌గా రాణించన‌ప్ప‌టికీ, మా ప్ర‌ద‌ర్శ‌న స్థాయి మాత్రం పెరుగుతుంద‌ని కచ్చితంగా చెప్పగలను' అని రజా పేర్కొన్నాడు.


'నా కెరీర్‌లో 22 టెస్టులు మాత్ర‌మే ఆడిన‌ప్ప‌టికీ, ఒక క్రికెట‌ర్‌గా ఎద‌గ‌డంలో టెస్టు ఫార్మాట్ కీల‌క‌పాత్ర పోషింది. ఇక సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న‌ప్ప‌టికీ మాకు పెద్ద‌గా లాభం లేద‌ని భావిస్తున్నాను. ఆతిథ్య హోదా ద‌క్క‌డం వ‌ల్ల మేము ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌గ‌లుగుతున్నాం. 2027 అక్టోబ‌ర్ 24న విక్టోరియా ఫాల్స్‌లో కొత్త‌గా నిర్మించ‌న మోసి-ఓ-టున్యా అంత‌ర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్‌ను భార‌త్‌తో ఆడ‌నుండ‌డంతో క‌చ్చితంగా అది ప్ర‌త్యేక‌మే అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ కోసం మేము ఎంత‌గానో ఎదురుచూస్తున్నాం' అని సింకందర్ రజా చెప్పుకొచ్చాడు.


Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 15 , 2026 | 05:47 PM