IND vs NZ: సూర్య కుమార్ రికార్డ్ బ్రేక్ చేసిన శ్రేయస్
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:10 PM
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఓడినప్పటికీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఓడినప్పటికీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 19 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బంతికి అయ్యర్(50) ఔటై పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో శ్రేయస్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌పై టీ20ల్లోఅత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన భారత కెప్టెన్‌గా అయ్యర్ కొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. గతంలో కివీస్‌పై రాయ్‌పూర్‌లో సూర్య 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా సూర్య ఆల్‌టైమ్ రికార్డును శ్రేయస్ బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌తో పాటు ఇషాన్ కిషన్(61) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 93 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. న్యూజిలాండ్ గడ్డపై ఆజట్టుపైనే మూడో వికెట్‌కు టీమిండియాకు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తొలి జాబితా విడుదలైన మరుసటి రోజే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..
ఇరాన్‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్
జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత