Share News

ధోనీ రిటైర్మెంట్‌పై సాక్షి ఎమోషనల్ పోస్ట్..

ABN , Publish Date - Nov 18 , 2026 | 10:46 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అంతా తానై నడిపించిన ‘కెప్టెన్‌ కూల్‌’ మహేంద్ర సింగ్‌ ధోనీ శకం ముగిసింది. 19 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో సారథి, బ్యాటర్‌, వికెట్ కీపర్‌గా రాణించిన ధోని.. ఆటగాడిగా తన ఇన్నింగ్స్ ముగించాడు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌పై అతడి సతీమణి సాక్షి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ధోనీ రిటైర్మెంట్‌పై సాక్షి ఎమోషనల్ పోస్ట్..
Sakshi Dhoni

స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అంతా తానై నడిపించిన ‘కెప్టెన్‌ కూల్‌’ మహేంద్ర సింగ్‌ ధోనీ శకం ముగిసింది. 19 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో సారథి, బ్యాటర్‌, వికెట్ కీపర్‌గా రాణించిన ధోని.. ఆటగాడిగా తన ఇన్నింగ్స్ ముగించాడు. అదే సమయంలో సీఎస్కేకు మెంటార్‌గా క్రికెట్ ప్రియులను అలరించనున్నాడు. ధోని రిటైర్మెంట్‌పై ఆయన భార్య సాక్షి ధోని (Sakshi Dhoni) ఎమోషనల్ పోస్టు పెట్టారు. జీవితంలో మరో మధురమైన కొత్త ప్రయాణం ప్రారంభం కావాలంటే.. కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందేనంటూ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు.


‘ఇంతకాలం మహీ (MS Dhoni)ని ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం. కొత్త ఆరంభాలకు.. సరికొత్త సాహసాలకు.. మరెన్నో అందమైన జ్ఞాపకాలకు స్వాగతం. మహీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ పర్వతాల వైపు చూస్తున్న ధోని ఫొటోను సాక్షి షేర్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ధోని కెప్టెన్సీలో చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుని ఒక బలమైన జట్టుగా స్థిరపడింది. ఇక ధోని, సాక్షి ప్రయాణం కోల్‌కతాలోని తాజ్ హోటల్‌ నుంచి ప్రారంభమైంది. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. చివరకు 2010లో దేహ్రాదూన్‌లో వారిద్దరు వివాహం చేసుకున్నారు. ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరిట వచ్చిన చిత్రంలో వీరి ప్రేమకథ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:భ

ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ప్రశంసలు..

‘థ్యాంక్యూ హెడీ’.. హెడ్ వీడ్కోలుపై అభిషేక్ శర్మ భావోద్వేగ పోస్ట్

Updated Date - Nov 18 , 2026 | 11:11 AM