ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ప్రశంసలు..
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:00 AM
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. దాదాపు 19 ఏళ్ల పాటు ఈ లీగ్‌లో కొనసాగిన అతడు ఇకపై మైదానంలో ఆటగాడిగా కనిపించడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. దాదాపు 19 ఏళ్ల పాటు ఈ లీగ్‌లో కొనసాగిన అతడు ఇకపై మైదానంలో ఆటగాడిగా కనిపించడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో అతడి అనుబంధం మాత్రం కొనసాగనుంది. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ధోనీ ఆటకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి కూడా అతడికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి (MS Dhoni Retirement).
ధోనీ ఆటగాడిగా ఐపీఎల్‌కు దూరం కావడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. అతడి నాయకత్వం, ఆటతీరు, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే విధానం క్రికెట్ ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేశాయని కొనియాడాయి. ధోనీ నాయకత్వంలో ఆడిన యువ క్రికెటర్లు ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటారని పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ధోనీ ప్రభావం ఒక ఫ్రాంచైజీకి, ఒక దేశానికే కాకుండా అంతర్జాతీయంగా ప్రభావం చూపించిందని ప్రశంసించాడు (Pakistan Cricketer Praise Dhoni).
'అతడు ఒక విజయవంతమైన కెప్టెన్. ప్రసిద్ధ నంబర్ 7 జెర్సీని ధరించి, పసుపు రంగు చొక్కాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు అతడు ఆడుతూ ఉండకపోవచ్చు. కానీ అతడు ఆడేటప్పుడు చెపాక్ స్టేడియంలో వాతావరణం ఎలా ఉండేదో చూశాను. ఇకపై కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అతడి మార్గదర్శకత్వం రాబోయే తరానికి ప్రయోజనకరంగా ఉంటుంది' అని లతీఫ్ పేర్కొన్నాడు (Dhoni IPL Career). ధోనీ కెప్టెన్‌గా లేకపోయినా, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండడం కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నాడు. అలాగే పాకిస్థాన్‌కు చెందిన మరో మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ కూడా ధోనీ కెప్టెన్సీని ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..