Share News

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

ABN , Publish Date - May 26 , 2026 | 07:02 PM

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
RCB vs GT Toss Update

స్పోర్ట్స్ డెస్క్: ఇవాళ ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌ తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న ఈ రెండు జట్ల మధ్య రసవత్తర సమరం ఖాయం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్‌ (రాజస్థాన్‌ × హైదరాబాద్‌) విజేతతో తలపడుతుంది.


తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఇంపాక్ట్ సబ్‌లు: రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా, సాయి కిషోర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ( వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్

ఇంపాక్ట్ సబ్‌లు: రొమారియో షెపర్డ్, సుయాశ్ శర్మ, కనిష్క్ చౌహాన్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్


ఇవి కూడా చదవండి:

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!

కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

Updated Date - May 26 , 2026 | 07:22 PM