ముగిసిన అజిత్ అగార్కర్ పదవి కాలం.. జడేజా పోస్ట్ వైరల్
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:51 AM
బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీతో అగార్కర్ పదవీకాలం ముగిసింది. వెంటనే ఖాళీగా ఉన్న సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీతో అగార్కర్ పదవీకాలం ముగిసింది. వెంటనే ఖాళీగా ఉన్న సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్తగా రాబోయే సెలక్టర్‌ని బట్టి తదుపరి చీఫ్ సెలక్టర్ ఎంపిక ఉండబోతోంది. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆసక్తికర పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బీసీసీఐ దరఖాస్తుల నోటిఫికేషన్‌కు సంబందించిన పోస్టును షేర్ చేసిన జడ్డూ (Ravindra Jadeja).. ‘ప్రాసెస్ ఏంటి?’ అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీని జోడించాడు. దీంతో ఆ పోస్టుకు రవీంద్ర జడేజా ఏమైనా అప్లై చేసుకుంటాడా?పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ రవీంద్ర జడేజాను కొన్ని వన్డే సిరీస్‌లకు పక్కన పెట్టింది. అప్పుడు వీరిద్దరి మధ్య సంబంధాలు చెడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జడేజా తాజా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో జరిగిన ఆఫ్గానిస్థాన్ వన్డేలకు, యూకేలో జరిగిన ఇంగ్లాండ్ వన్డేలకు దూరమైన జడేజా, వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ సందర్భంగా జట్టులోకి పునరాగమనం చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి జడేజా 10 ఓవర్లలో 2/75, 0/54 బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. 2025 నుంచి ఆడిన తన చివరి 15 వన్డేలలో, జడేజా 10 ఇన్నింగ్స్‌లలో 29.80 సగటుతో 149 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 32 కాగా, స్ట్రైక్ రేట్ 95కు పైగా ఉంది. ఈ ఆల్‌రౌండర్ 15 మ్యాచ్‌లో 47.93 సగటుతో 14 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
మెస్సికి రొనాల్డో భావోద్వేగ వీడ్కోలు.. ‘ఫుట్‌బాల్ చరిత్రలో నీ పేరు శాశ్వతం’
భువిపై ఎవరూ దయ చూపలేదు.. అది అతడి అర్హత: వసీం జాఫర్