చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:25 PM
అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు.
స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టిండు. ఈ ఫార్మాట్లో మూడుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రషీద్ ఖాన్ (6/34) అదరగొట్టి ఈ ఘనత అందుకున్నాడు. గతంలో 2017 మార్చి 17న గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అఫ్గాన్ స్పిన్నర్ 9.3 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. అదే ఏడాది జూన్ 9న గ్రోస్ ఐస్లెట్‌లో వెస్టిండీస్‌పై 18 పరుగులే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు.
గతంలో శ్రీలంకు చెందిన అజంత మెండిస్, వానిందు హసరంగ, అకిల ధనంజయ, ఇమ్రాన్ తాహిర్(సౌతాఫ్రికా), షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్), సందీప్ లామిచానే (నేపాల్) వన్డేల్లో రెండేసిసార్లు ఆరు వికెట్ల సాధించారు. ఇప్పుడు ఈ స్మిన్నర్లందరినీ అధిగమించిన రషీద్ ఖాన్ కొత్త సృష్టించాడు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధికసార్లు ఆరు వికెట్లు తీసిన రికార్డు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉంది.
యూనిస్ తన కెరీర్‌లో మొత్తం ఐదుసార్లు ఆరుకు పైగా వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 121 వన్డేలు ఆడిన రషీద్, తన గత రెండు ఆరు వికెట్ల ప్రదర్శనలను ఐర్లాండ్‌పైనే నమోదు చేశాడు. వకార్ కూడా తన కెరీర్‌లో న్యూజిలాండ్‌పై రెండు సార్లు ఆరు వికెట్ల ప్రదర్శనలు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
10 ఏళ్ల నిరీక్షణ.. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండో పతకం
క్రికెట్ ఆస్ట్రేలియాపై యాష్లీ గార్డనర్ భార్య రైట్ ఫైర్!