10 ఏళ్ల నిరీక్షణ.. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండో పతకం
ABN , Publish Date - Aug 08 , 2026 | 03:35 PM
అండర్ 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ అద్భుతం చేశాడు. ఈ ఈవెంట్ జావెలిన్ త్రో విభాగంలో రజతం సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: అండర్ 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ అద్భుతం చేశాడు. ఈ ఈవెంట్ జావెలిన్ త్రో విభాగంలో రజతం సాధించాడు. దాదాపు పదేళ్ల తర్వాత ఆశిష్ రూపంలో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు రెండో పతకం వచ్చింది. ఇదే ఈవెంట్‌లో పదేళ్ల క్రితం స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు.
తాజాగా ఆశిష్ రజత పతకం సొంతం చేసుకుని అండర్ 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండో భారత్ అథ్లెట్‌గా నిలిచాడు. ఈ 19 ఏళ్ల యువ అథ్లెట్ మెరుగైన ప్రదర్శనే చేసి.. చివరకు విజయం సాధించాడు. సౌతాఫ్రికా అథ్లెట్ జాన్ హైడ్రిక్ హైమన్స్ 80.50 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ఆశిష్ 74.09 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు.
యాదవ్‌కు ఆది నుంచీ గట్టి పోటీనే ఎదురైంది. తొలి రౌండ్ లో 69.96 మీ. మూడో త్రోలో 74.09 మీ. విసిరి తన సీజన్ బెస్ట్‌ను నమోదు చేశాడు. ఇక డొమినికాకు చెందిన అడ్డిసన్ జేమ్స్ 73.89 మీటర్లు విసిరి కాంస్య పతకంతో మూడో స్థానంలో నిలిచాడు. 2016లో పోలాండ్‌లోని బైడ్‌గోస్జ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా(86.48మీ) భారత్‌కు గోల్డ్ మెడల్ అందించాడు. ఇదే జావెలిన్ త్రోలో భారత్‌కు తొలి పతకం కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
క్రికెట్ ఆస్ట్రేలియాపై యాష్లీ గార్డనర్ భార్య రైట్ ఫైర్!
వైభవ్ సూర్యవంశీలో ఉన్న ప్రత్యేకత అదే: శిఖర్ ధావన్