వైభవ్ సూర్యవంశీలో ఉన్న ప్రత్యేకత అదే: శిఖర్ ధావన్
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:33 PM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించడం గొప్ప విషయమని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించడం గొప్ప విషయమని చెప్పాడు. వైభవ్‌లో నైపుణ్యంతో పాటు షాట్లు ఆడేందుకు అవసరమైన ధైర్యం కూడా ఉందని కొనియాడాడు.
‘వైభవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. ఐపీఎల్‌లోనూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఫోర్లు, సిక్సర్లు కొట్టే విధానం చాలా బాగుంది. 15 ఏళ్ల వయసులోనే అలాంటి షాట్లు ఆడే ధైర్యం, మానసిక స్థైర్యం ఉండటం చాలా గొప్ప విషయం. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను’ అని శిఖర్ ధావన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సి హ్యతకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీ ఫోకస్.. టెస్టుల్లో సత్తా చాటుతాడా?