Share News

క్రికెట్ ఆస్ట్రేలియాపై యాష్లీ గార్డనర్ భార్య రైట్ ఫైర్!

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:00 PM

క్రికెట్ ఆస్ట్రేలియాపై స్టార్ క్రికెటర్ యాష్లీ గార్డనర్ భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డనర్‌కు సహచరితో వివాహేతర సంబంధం ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఏను ప్రశ్నించింది.

క్రికెట్ ఆస్ట్రేలియాపై యాష్లీ గార్డనర్  భార్య రైట్ ఫైర్!
Ashley Gardner

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ యాష్లీ గార్డనర్ భార్య మోనికా రైట్ ఆదేశ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యాష్లీ తన సహచర క్రీడాకారిణి జార్జియా వోల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. గార్డనర్ తనను మోసం చేసిందని బహిరంగంగా ఆరోపించిన రైట్, ఆమెను వైస్ కెప్టెన్సీని తొలగించాలని కూడా అధికారులను డిమాండ్ చేసింది.


'క్రికెట్ ఆఫ్ ఆస్ట్రేలియా(సీఏ) ఇతరులకు ఆదర్శంగా నిలవాలని భావిస్తే.. నైతిక ప్రమాణాలను పాటించాల్సిన బాధ్యత ఆ బోర్డుపై ఉంటుంది. గార్డనర్‌కు సీఏ బహిరంగంగా ఎందుకు ఏమీ హెచ్చరికలు ఇవ్వలేదో నాకు అర్థం కావడం లేదు. సీఏ బోర్డు అధికారుల మౌనం యాష్లీ, జార్జియాల అనైతిక బంధానికి మద్దతు ఇస్తున్నారని అర్థమా?. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి నాయకత్వ స్థానంలో కొనసాగకూడదు. కెప్టెన్లు ప్రమాణాలను నెలకొల్పాలని ఆశిస్తాము. కానీ గార్డనర్ ప్రవర్తన ఆ ప్రమాణాలకు చాలా దూరంగా ఉంది' అని రైట్ పేర్కొన్నారు.


అయితే, ఈ వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ... ఈ అంశం అనేది వారి వ్యక్తిగతమైనదని పేర్కొంది. తమ ఆటగాళ్లలోని అన్ని సంబంధాలు, ప్రవర్తనలు 'పని ప్రదేశంలో గౌరవం' విధానానికి అనుగుణంగా ఉండేలా చర్యలు ఉంటాయని సీఏ స్పష్టం చేసింది. రైట్, గార్డనర్ ఏప్రిల్ 2025లో వివాహం చేసుకున్నారు. కానీ 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం గార్డనర్ భారత్‌లో ఉన్నప్పుడు వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో వోల్‌తో గార్డనర్‌కు వివాహేతర సంబంధం ఉందని రైట్ ఆరోపించడంతో, అప్పటి నుంచి వారిద్దరు విడిపోయారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీలో ఉన్న ప్రత్యేకత అదే: శిఖర్ ధావన్

ఇప్పట్లో మైదానంలోకి దిగడం కష్టమే.. బుమ్రా, హార్దిక్ గాయాలపై అప్‌డేట్!

Updated Date - Aug 08 , 2026 | 03:32 PM