Share News

శత్రువుల కోసం పదడుగులు ముందే ఉంటా: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:53 PM

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బుద్దా వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారంతోపాటు బుద్దా వెంకన్న జన్మదిన వేడుకలను కూడా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

శత్రువుల కోసం పదడుగులు ముందే ఉంటా: బుద్దా వెంకన్న
Buddha Venkanna

విజయవాడ, ఆగస్టు 8: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బుద్దా వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారంతోపాటు బుద్దా వెంకన్న జన్మదిన వేడుకలను కూడా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ పార్లమెంట్‌సభ్యుడు ఈ నియోజకవర్గాన్ని చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. పార్టీ కోసం నాలుగడుగులు వెనక్కి, శత్రువు కోసం పది అడుగులు ముందుంటామని తెలిపారు.


2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చారని వెంకన్న తెలిపారు. శ్రీనివాస్ రాజకీయ నేత కాదని... పైరవీలు చేసుకునే పైరవీల నాయకుడంటూ ధ్వజమెత్తారు. ‘నువ్వు రాజకీయ ఊసరవెల్లివి.. నిన్ను పుచ్చిపోయిన వంకాయలతో మీ నాయకులే కొడతారు. నువ్వు కొబ్బరి చిప్పల దొంగవి.. తెలుగుదేశం పార్టీ నాయకులు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు’ అంటూ బుద్దా వెంకన్న హెచ్చరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పొలిట్ బ్యూరో సభ్యులు షరీఫ్, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

‘ఇష్టం వచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోం’.. వైసీపీ నేతలకు బోండా ఉమ స్ట్రాంగ్ వార్నింగ్

కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలనే బలితీసుకుంటున్నారు.. జగన్‌పై మంత్రి సవిత ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 03:59 PM