Share News

రజత్ పాటిదార్‌కు మరో అరుదైన అవకాశం..

ABN , Publish Date - Nov 07 , 2026 | 09:15 PM

టీమిండియా యువ ఆటగాడు రజత్ పాటిదార్‌కు మరో అరుదైన అవకాశం లభించింది. మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి మధ్యప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తమ జట్టును ప్రకటించింది.

రజత్ పాటిదార్‌కు మరో అరుదైన అవకాశం..
Rajat Patidar

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ ఆటగాడు రజత్ పాటిదార్‌కు మరో అరుదైన అవకాశం లభించింది. మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి మధ్యప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు స్టార్‌ ప్లేయర్‌ రజత్‌ పాటిదార్‌ నాయకత్వం వహిస్తాడని ఎంసీఏ తెలిపింది. కాగా ఈ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్లకు ఎంసీఏ చోటిచ్చింది.


ఐపీఎల్‌ స్టార్లు అనికేత్‌ వర్మ, ఆవేశ్‌ ఖాన్‌, సారాంశ్‌ జైన్‌ తదితరులు మధ్యప్రదేశ్ జట్టులో ఉన్నారు. గతంలో రజత్‌ పాటిదార్‌ సారథ్యంలోనే మధ్యప్రదేశ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని సొంతం చేసుకుంది. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఎలైట్‌ గ్రూప్‌-‘సి’లో ఉన్న మధ్యప్రదేశ్.. తమ తొలి చండీగఢ్‌ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో కేరళతో తలపడుతుంది. కాగా రజత్‌ పాటిదార్‌ ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు 2025లో తొలిసారి టైటిల్‌ అందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోనే ఆర్సీబీ మరోసారి ట్రోఫీని ముద్దాడింది. మధ్యప్రదేశ్‌కు టైటిల్‌ అందించడం ద్వారా ఆర్సీబీ కెప్టెన్‌గా పాటిదార్‌ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంగతి తెలిసిందే.


మధ్యప్రదేశ్‌ జట్టు:

రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), అంకుశ్‌ సింగ్‌, అక్షత్‌ రఘువన్షీ, హర్ష్‌ గావిల్‌ (వికెట్‌ కీపర్‌), అనికేత్‌ వర్మ, రితిక్‌ టడా, అపూర్వ్‌ ద్వివేది (వికెట్‌ కీపర్‌), సారాంశ్‌ జైన్‌, కుమార్‌ కార్తికేయ సింగ్‌, శివం శుక్లా, శివాంగ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌, త్రిపురేశ్‌ సింగ్‌, రాహుల్‌ బతామ్‌, మంగేశ్‌ యాదవ్‌.


ఇవి కూడా చదవండి:

ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: మిచెల్ శాంట్నర్

బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ తౌహీద్‌ హృదోయ్‌ సరికొత్త రికార్డు..

షాహిద్ అఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..

Updated Date - Nov 07 , 2026 | 09:15 PM