Share News

ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!

ABN , Publish Date - Sep 13 , 2026 | 10:27 AM

ఇవాళ్టి నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'విన్నర్ స్టేస్' ఛాలెంజ్‌లో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పాల్గొన్నాడు.

ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!
Rahul Dravid

స్పోర్ట్స్ డెస్క్: ఇవాళ్టి నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'విన్నర్ స్టేస్ ఆన్(Winner Stays on)'ఛాలెంజ్‌లో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లను అతడు ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ కంటే పాకిస్థాన్ దిగ్గజ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కే రాహుల్ ద్రవిడ్ ప్రాధాన్యత ఇచ్చాడు.


ఈ ఛాలెంజ్‌లో రౌండ్ల వారిగా రాహుల్ ద్రవిడ్.. బెస్ట్ కెప్టెన్లను మారుస్తూ వచ్చాడు. అతిమంగా ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో అనేది ద్రవిడ్ తేల్చేశాడు. మొదటి కొన్ని రౌండ్లలో బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, అర్జున రణతుంగ, గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్‌ల కంటే స్టీవ్ స్మిత్‌ను బెస్ట్ కెప్టెన్‌గా ద్రవిద్ ఎంపిక చేశాడు. స్టీవ్ స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా అన్ని ఫార్మాట్లలో కలిపి 117 మ్యాచ్‌ల్లో 62 విజయాలు సాధించింది.


అయితే ఆ తర్వాత రౌండ్‌లో స్మిత్ కంటే మరో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను రాహుల్ ద్రవిడ్ ఎంచుకున్నాడు. పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా 2003, 2007ల్లో వరుసగా వన్డే ప్రపంచ కప్‌లను గెలుచుకోవడమే కాకుండా 324 మ్యాచ్‌ల్లో ఏకంగా 220 విజయాలు సాధించింది. ఇక తర్వాతి రౌండ్లో అలన్ బార్డర్ కంటే పాంటింగ్‌ను, ఆ తదుపరి రౌండ్‌లో స్టీవ్ వాను పాంటింగ్ కంటే మెరుగైన కెప్టెన్‌గా పేర్కొన్నాడు. తదనంతర రౌండ్‌లో స్టీవ్ వా స్థానంలో విరాట్ కోహ్లీని ద్రవిడ్ ఎంపిక చేశాడు. అతడి సారథ్యంలో భారత్ 213 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించింది.


ఇక తదుపరి రౌండ్లో కోహ్లీ కంటే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ను ద్రవిడ్ ఎంచుకున్నారు. చివరగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రాహుల్ ద్రవిడ్ జై కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకరు. అతడి కెప్టెన్సీలో టీమిండియా 332 మ్యాచ్‌ల్లో 178 విజయాలు సాధించింది. అలానే 2007 నుంచి 2013 మధ్య మూడు ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీలను గెలవడంతో పాటు టెస్టుల్లో నంబర్-1 ర్యాంకును కూడా సాధించింది. చివరి రౌండ్లో వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌తో పోలిస్తే ఎంఎస్ ధోనీనే అత్యుత్తమ కెప్టెన్ అని ద్రవిడ్ తన ఆఖరి అభిప్రాయాన్ని వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ మహిళ ప్లేయర్ సంచలన నిర్ణయం

బాక్స్ వెలుపల నుంచి మెస్సి మ్యాజిక్‌.. మెరిపించిన అద్భుత గోల్!

Updated Date - Sep 13 , 2026 | 11:14 AM