Share News

బాక్స్ వెలుపల నుంచి మెస్సి మ్యాజిక్‌.. మెరిపించిన అద్భుత గోల్!

ABN , Publish Date - Sep 13 , 2026 | 08:18 AM

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్‌మెంట్ తర్వాత ఆడుతున్న మేజర్ లీగ్ సాకర్‌లో అద్భుతమైన గోల్ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

బాక్స్ వెలుపల నుంచి మెస్సి మ్యాజిక్‌.. మెరిపించిన అద్భుత గోల్!
Lionel Messi

స్పోర్ట్స్ డెస్క్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అతడు తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంతో అతడి అభిమానులతో పాటు క్రీడా ప్రపంచం షాక్ గురైంది. ఇక మెస్సి మెరుపులు చూడలేము కదా అని పలువురు భావోద్వేగానికి గురయ్యాడు. మెస్సికి 39 ఏళ్లు వచ్చినా, అతని ఆటతీరులో ఏమాత్రం వేగం తగ్గలేదు. మేజర్ లీగ్ సాకర్(ఎంఎల్ఎస్)లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో మెస్సి అద్భుతమైన గోల్ చేసి.. అందరినీ ఆకట్టుకున్నాడు.


మేజర్ లీగ్ సాకర్ (MLS)లో భాగంగా శనివారం ఇంటర్ మయామి, నాష్‌విల్ జట్లు తలపడ్డాయి. ఇంటర్ మయామి తరఫున మెస్సి ఆడుతున్నాడు. 2-2తో ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా... మెస్సి చేసిన గోల్ ప్రత్యేకంగా నిలిచింది. 62వ నిమిషంలో పెనాల్టీ బాక్స్ వెలుపల నుంచి మెస్సి కొట్టిన షాట్‌తో ఇంటర్ జట్టును 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. చుట్టు ప్రత్యర్థి ఆటగాళ్లే ఉన్న.. వారందరినీ దాటిస్తూ.. బంతిని నేరుగా బాక్స్‌లోకి పంపించాడు.


మెస్సి చేసిన ఈ సూపర్ గోల్ కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు ఇంజూరీ టైమ్‌లో ప్రత్యేర్థి ప్లేయర్ గోల్ చేసి స్కోరును సమం చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. మెస్సి 2023లో మయామి జట్టులో చేరాడు. అప్పటి నుంచి జరిగిన అన్ని సీజన్లలో నాష్‌విల్ జట్టుపై 14 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ సాధించాడు. మొత్తంగా మెస్సి చేసిన ఈ గోల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

నాకు చావే శరణ్యం

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ గీషెల్టన్‌

Updated Date - Sep 13 , 2026 | 08:29 AM