యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్ గీషెల్టన్
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:37 AM
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్ నెం.1, ఫ్రెంచ్ ఓపెన్ విజేత జ్వెరెవ్ (జర్మనీ) 6-3, 7-6 (7), 7-6 (6)తో అన్‌సీడెడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచాడు
యూఎస్ ఓపెన్ ఫైనల్లో
జ్వెరెవ్ గీషెల్టన్
సెమీస్‌లో ఖచనోవ్, టియఫో అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్ నెం.1, ఫ్రెంచ్ ఓపెన్ విజేత జ్వెరెవ్ (జర్మనీ) 6-3, 7-6 (7), 7-6 (6)తో అన్‌సీడెడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచాడు. మరో సెమీ్‌సలో షెల్టన్ (అమెరికా) 4-6, 6-3, 6-3, 7-5తో తన దేశానికే చెందిన 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫోను ఓడించాడు. ఆదివారం టైటిల్ ఫైట్ జరగనుంది. షెల్టన్ ఫైనల్ చేరిన దరిమిలా సుదీర్ఘకాలం తర్వాత ఓ అమెరికన్‌కు యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ దక్కించుకొనే చాన్స్ లభించింది. అమెరికా తరఫున చివరిసారిగా 2003లో ఆండీ రాడిక్ ఇక్కడ విజేతగా నిలిచాడు.