Share News

భారత క్రికెట్ మహిళా ప్లేయర్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Sep 13 , 2026 | 09:37 AM

భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటర్ హర్లీన్ డియోల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు డియోల్ సిద్దమైంది.

భారత క్రికెట్ మహిళా ప్లేయర్ సంచలన నిర్ణయం
Harleen Deol

స్పోర్ట్స్ డెస్క్: భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టులోని చాలా మంది ప్లేయర్లు వివిధ దేశాల్లో జరిగే లీగ్స్ లో పాల్గొంటుంటారు. ఇప్పటికే కౌంటీ ఛాంపియన్ షిప్, బీబీఎల్ వంటి లీగ్స్‌లో పలువురు టీమండియా ప్లేయర్లు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వారి బాటలోనే మరో భారత మహిళ క్రికెటర్ వెళ్లనుంది. హర్లీన్ డియోల్ మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ 'బార్బడోస్ రాయల్స్' జట్టుతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది.


28 ఏళ్ల హర్లీన్ డియోల్ ప్రస్తుతం సీనియర్ భారత జట్టులో గానీ, 'ఇండియా ఎ' జట్టులో గానీ సభ్యురాలు లేదు. దీంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) టోర్నమెంట్ మొత్తానికి అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ సీపీఎల్‌లో మొత్తం ఐదుగురు భారత మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. బార్బడోస్ రాయల్స్‌ తరఫున హర్లీన్ డియోల్, కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్‌ ఆడనుండగా.. శిఖా పాండే, యస్తికా భాటియా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టులో భాగం కానున్నారు.


ఇక డియోల్ విషయానికి వస్తే.. ఆమె భారత్ తరఫున 28 టీ20 మ్యాచ్‌ల్లో 92.01 స్ట్రైక్ రేట్‌తో 311 పరుగులు చేసింది. చివరగా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె టీమిండియా తరఫున ఆడింది. అయితే భారత్‌లో నిర్వహించే డబ్ల్యూపీఎల్‌లో హర్లీన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ లీగ్‌లో ఆమె 28 మ్యాచ్‌లలో 649 పరుగులు సాధించింది. డియోల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లలో భాగంగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

బాక్స్ వెలుపల నుంచి మెస్సి మ్యాజిక్‌.. మెరిపించిన అద్భుత గోల్!

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ గీషెల్టన్‌

Updated Date - Sep 13 , 2026 | 10:11 AM