Share News

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

ABN , Publish Date - Jun 17 , 2026 | 07:38 AM

మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌కు వరుసగా రెండో షాక్ తగిలింది. మంగళవారం గ్రూప్‌-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం
New Zealand Women vs Sri Lanka Women

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ కు మరో షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో కరేబియన్ జట్టైన వెస్టిండీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్.. తాజాగా శ్రీలంక చేతిలో కూడా పరాజయం పాలైంది. నిన్న(మంగళవారం) గ్రూప్‌-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెలీ కేర్‌ (45), సోఫీ డివైన్‌ (45) మాత్రమే రాణించారు. జార్జియా ప్లిమ్మర్ 18, మ్యాడీ గ్రీన్18 పరగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ ఆశించిన మేర రాణించలేదు. ఇక శ్రీలంక బౌలర్లలో కవిష రెండు వికెట్లు సాధించింది. మిథాలి, సుగంధిక, చమరి, నిమిష తలో వికెట్‌ పడగొట్టారు.


అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కివీస్ బౌలర్ నెన్సి పటేల్‌ధాటికి 8.3 ఓవర్లలో 55/4తో లంక కష్టాల్లో చిక్కుకుంది. ఈ స్థితిలో నీలాక్షిక సిల్వా (37 బంతులు, 54 నాటౌట్) నిలిచింది. కౌషిని (24 నాటౌట్‌), కవీషా (17) తోడుగా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన నీలాక్షిక.. మరో రెండు బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చింది.


కివీస్ బౌలర్ నెన్సి రెండు, ఇల్లింగ్ ఒక వికెట్ సాధించారు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌పై లంకకు ఇదే తొలి గెలుపు. వరుసగా రెండు ఓటములతో కివీస్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. జూన్ 19న న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్‌లో ఐర్లాండ్ తో తలపడనుంది. అలానే జూన్ 21న వెస్టిండీస్‌తో శ్రీలంక ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

ఈజిప్ట్‌ సెల్ఫ్‌ గోల్‌

ఇక సిరీస్‌పైనే గురి

Updated Date - Jun 17 , 2026 | 07:46 AM