Share News

ఇక సిరీస్‌పైనే గురి

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:36 AM

కొన్ని నెలలుగా టీ20 క్రికెట్‌తో పాటు మధ్యలో ఓ టెస్టు ఆడిన భారత క్రికెట్‌ జట్టు వన్డే ఫార్మాట్‌లోనూ బోణీ కొట్టింది. అఫ్ఘానిస్థాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సను చక్కటి విజయంతో...

ఇక సిరీస్‌పైనే గురి

నేడు అఫ్ఘాన్‌తో రెండో వన్డే

మ. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

జోష్‌లో టీమిండియా

లఖ్‌నవూ: కొన్ని నెలలుగా టీ20 క్రికెట్‌తో పాటు మధ్యలో ఓ టెస్టు ఆడిన భారత క్రికెట్‌ జట్టు వన్డే ఫార్మాట్‌లోనూ బోణీ కొట్టింది. అఫ్ఘానిస్థాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సను చక్కటి విజయంతో ఆరంభించింది. తాజాగా బుధవారం రెండో వన్డే జరుగనుంది. ఇందులోనే భారత్‌ గెలిచి సిరీస్‌ పట్టేయాలనుకుంటోంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌ కోసం సిద్ధమవుతున్న గిల్‌ సేన బలాబలాలను పరీక్షించుకునే ప్రణాళికల్లో ఉంది. అటు అఫ్ఘానిస్థాన్‌ జట్టు భారత్‌లాంటి పటిష్ట జట్టుతో పోటీ పడే సత్తా ఉందని నిరూపించింది. కానీ కీలక సమయంలో బ్యాటర్లు, బౌలర్ల తడబాటు దెబ్బతీసింది. ఈ విషయంలో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. తమ లోపాలను సరిదిద్దుకుని నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీ్‌సను సజీవంగా ఉంచుతారో? లేదో? చూడాలి.

రోహిత్‌ ఆడేనా?: తొలి మ్యాచ్‌ సందర్భంగా బ్యాటింగ్‌ సమయంలో ఒమర్జాయ్‌ వేసిన బంతి రోహిత్‌ మణికట్టుకు బలంగా తాకింది. దీంతో హిట్‌మ్యాన్‌ ఈ రెండో వన్డేలో బరిలోకి దిగడంపై సందేహం నెలకొంది. రోహిత్‌ స్థానంలో ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్‌ను ఆడించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 17 , 2026 | 03:37 AM