Share News

50 వేల టికెట్లు సేల్.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లకు హౌస్‌ఫుల్ హంగామా!

ABN , Publish Date - Sep 09 , 2026 | 07:00 PM

అక్టోబర్ నెలలో భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు బయలుదేరుతుంది. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచులు ఆడనుంది.

50 వేల టికెట్లు సేల్.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లకు హౌస్‌ఫుల్ హంగామా!
India vs New Zealand 2026

స్పోర్ట్స్ డెస్క్: అక్టోబర్ నెలలో భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు బయలుదేరుతుంది. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచులు ఆడనుంది. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో టీమిండియా టూర్ మొదలుకానుంది. 2019 తర్వాత తొలిసారి భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లబోతుండటంతో అన్ని ఫార్మాట్ల మ్యాచులకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతుండటమే ఇందుకు నిదర్శనం.


న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపిన ఓ ప్రకటన ప్రకారం... ‘సోమవారం సాధారణ ప్రజలకు మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. క్రైస్ట్‌చర్చ్‌లో భారత్‌తో జరగనున్న రెండు టీ20 మ్యాచులతో సహా పలు మ్యాచ్‌ల టికెట్లు దాదాపు పూర్తిగా అమ్ముడయ్యాయి. రెండో టీ20 మ్యాచ్ టికెట్లు 75 శాతం అమ్ముడయ్యాయి. అక్టోబర్ 30న నాలుగో టీ20 జరగనున్న ఈడెన్ పార్క్‌ (ఆక్లాండ్)లో అధిక డిమాండ్ ఉంది. దీంతో మొదటిసారిగా స్టేడియం ఆరో అంచె సీటింగ్ తెరవాల్సి ఉంది’ అని తెలిపింది.


భారత్.. న్యూజిలాండ్ షెడ్యూల్

ఐదు టీ20ల సిరీస్

  • అక్టోబర్ 22 - తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్‌)

  • అక్టోబర్ 24 - రెండో టీ20 (క్రైస్ట్‌చర్చ్‌)

  • అక్టోబర్ 27 - మూడో టీ20 (వెల్లింగ్టన్)

  • అక్టోబర్ 30 - నాలుగో టీ20 (ఆక్లాండ్)

  • నవంబర్ 1 - ఐదో టీ20 (హామిల్టన్)


5 వన్డేల సిరీస్

  • నవంబర్ 4 - తొలి వన్డే (ఆక్లాండ్)

  • నవంబర్ 7 - రెండో వన్డే (వెల్లింగ్టన్)

  • నవంబర్ 10 - మూడో వన్డే (హామిల్టన్)

  • నవంబర్ 13 - నాలుగో వన్డే (మౌంట్ మౌంగనుయి)

  • నవంబర్ 15 - ఐదో వన్డే (మౌంట్ మౌంగనుయి)

రెండు టెస్టుల సిరీస్

  • నవంబర్ 19-23: తొలి టెస్టు

  • నవంబర్ 27-డిసెంబరు 1: రెండో టెస్టు


ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రత్యర్థి.. ఆ బాధ తనకు తెలుసంటూ..!

పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్

Updated Date - Sep 09 , 2026 | 07:07 PM