ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కోచ్‌కు జరిమానా
ABN , Publish Date - May 15 , 2026 | 11:24 AM
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్‌కు బిగ్ షాక్ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ముంబై జట్టు.. పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇది ఇలా ఉంటే.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి జరిమానా విధించింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి నిబంధనల్లోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు కీరన్ పొలార్డ్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది. మ్యాచ్ అధికారులపై ఆగ్రహంతో ప్రవర్తించినందుకు ఈ వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్‌కు అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. మైదానం పక్కన కోచ్ పొలార్డ్ ప్రవర్తన మ్యాచ్ రిఫరీకి నచ్చలేదు. ముంబై ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్‌లో ఈ ఉల్లంఘన జరిగింది.
'మ్యాచ్ సమయంలో ఫోర్త్ అంపైర్‌ను ఉద్దేశించి వినపడేలా అసభ్యపదజాలం ఉపయోగించినట్లు పొలార్డ్ పై ఆరోపణలు వచ్చాయి. విచారించిన అధికారులు పొలార్డ్ ను దోషిగా తేల్చారు. అతడి అసంతృప్తికి గల నిర్దిష్ట కారణం తెలియదు. అది వారి జట్టు అంతర్గతంగానే ఉన్నప్పటికీ పొలార్డ్ అంపైర్లపై అసభ్య పదజాలం వాడటం ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 కింద వస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పొలార్డ్‌కు అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించారు' అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. పొలార్డ్ తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ పంకజ్ ధర్మాని విధించిన శిక్షను అంగీకరించాడు. ఇలా కోచ్‌లకు జరిమానా పడటం కొత్తేమి కాదు. ఇటీవలే ఆర్సీబీ కోచ్‌కు కూడా ఐపీఎల్ కౌన్సిల్ జరిమానా విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!
చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్