పంజాబ్‌కు కష్టమే..
ABN , Publish Date - May 15 , 2026 | 02:21 AM
ఒకటా.. రెండా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా (ఒక మ్యాచ్ రద్దు) దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి దయనీయంగా మారింది. అందరికంటే ముందు ప్లేఆ్‌ఫ్సకు...
నేటి మ్యాచ్
లఖ్‌నవూ X చెన్నై
వేదిక: లఖ్‌నవూ, రా.7.30
వరుసగా ఐదో ఓటమి
ముంబైని గెలిపించిన తిలక్ వర్మ జూశార్దూల్‌కు నాలుగు వికెట్లు
ధర్మశాల: ఒకటా.. రెండా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా (ఒక మ్యాచ్ రద్దు) దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి దయనీయంగా మారింది. అందరికంటే ముందు ప్లేఆ్‌ఫ్సకు వెళ్తుందనుకున్న జట్టుకు ఇప్పుడు ఆ అవకాశమే ప్రమాదంలో పడింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 నాటౌట్) అదరగొట్టడంతో పంజాబ్‌పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రేయాస్ సేనకిది వరుసగా ఐదో ఓటమి. దీంతో 13 పాయింట్లతో ఉన్న ఈ జట్టు చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. చెన్నై, రాజస్థాన్‌లతో గట్టి పోటీ ఎదురుకానుంది. టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (32 బంతుల్లో 57), ఒమర్జాయ్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38), ప్రియాన్ష్ (17 బంతుల్లో 22) రాణించారు. పేసర్ శార్దూల్‌కు నాలుగు, దీపక్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలిచింది. రికెల్టన్ (23 బంతుల్లో 48), విల్ జాక్స్ (10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 నాటౌట్) వేగం చూపారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిలక్ నిలిచాడు. అలాగే ముంబై జట్టుకు బుమ్రా తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం.
తిలక్ అండతో..: భారీ ఛేదనలో ముంబైకి ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ (25) శుభారంభం అందించగా.. చివర్లో తిలక్ ఒత్తిడిని అధిగమిస్తూ జట్టుకు చక్కటి విజయాన్నందించాడు. స్వల్ప వ్యవధిలో రికెల్టన్, నమన్ (9)లతో పాటు రోహిత్ వెనుదిరగడంతో 88/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో తిలక్ వర్మ రూథర్‌ఫోర్డ్ (20)తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. 18వ ఓవర్‌లో తిలక్ 6,4,6తో 22 పరుగులు రావడంతో సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులకు మారింది. జాక్స్ 4, తిలక్ 6,6తో మరో బంతి ఉండగానే మ్యాచ్ ముగిసింది.
చివర్లో విధ్వంసం: పంజాబ్ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ రాణించినా.. ముంబై పేసర్ల ధాటికి మిడిలార్డర్ తడబడింది. ముఖ్యంగా శార్దూల్ జట్టును కుదురుకోనీయలేదు. కానీ డెత్ ఓవర్లలో ముం బై బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. టెయిలెండర్ల హిట్టింగ్‌తో జట్టు స్కోరు 200కి చేరింది. దీనికితోడు ముంబై ఫీల్డింగ్ వైఫల్యం కూడా కలిసివచ్చింది. ఇక రెండో ఓవర్‌లోనే వెనుదిరగాల్సిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ మరో ఓపెనర్ ప్రియాన్ష్‌తో కలిసి తను తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. కానీ ప్రియాన్ష్‌ను పేసర్ చాహర్ బౌల్డ్ చేయడంతో పవర్‌ప్లేలో 55/1 స్కోరుతో నిలిచింది. స్పిన్నర్ రఘు ఓవర్‌లో రెండు, బాష్ ఓవర్‌లో ఓ సిక్స్ బాదిన ప్రభ్‌సిమ్రన్ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 12వ ఓవర్‌లో ప్రభ్‌తో పాటు కెప్టెన్ శ్రేయాస్ (4)ను అవుట్ చేసిన పేసర్ శార్దూల్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా కూపర్, శార్దూల్ చెలరేగడంతో మొత్తంగా 40 పరుగుల తేడాతో ఆరు వికెట్లను కోల్పోయింది. ఈ స్థితిలో 140/7 స్కోరుతో నిలిచిన పంజాబ్‌కు 180 కూడా కష్టమే అనిపించింది. కానీ చివరి 3 ఓవర్లలో సీన్ మారిపోయింది. 18వ ఓవర్‌లో ఒమర్జాయ్ 4,6,6 బాది అవుటయ్యాడు. ఆ ఓవర్‌లో 19 రన్స్ రాగా.. తర్వాతి ఓవర్‌లో విష్ణు (15 నాటౌట్), బార్ట్‌లెట్ (18 నాటౌట్) ధాటికి 22 రన్స్ వచ్చాయి. బుమ్రా ఆఖరి ఓవర్‌లో 12 రన్స్ రాగా పంజాబ్ ఒక్కసారిగా భారీ స్కోరందుకుంది.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్ష్ (బి) చాహర్ 22, ప్రభ్‌సిమ్రన్ (సి) బాష్ (బి) శార్దూల్ 57, కూపర్ (బి) రాజ్ బవా 21, శ్రేయాస్ (బి) శార్దూల్ 4, సూర్యాన్ష్ (సి) రాజ్ బవా (బి) శార్దూల్ 8, శశాంక్ (ఎల్బీ) బాష్ 2, ఒమర్జాయ్ (సి) జాక్స్ (బి) చాహర్ 38, యాన్సెన్ (బి) శార్దూల్ 2, విష్ణు వినోద్ (నాటౌట్) 15, బార్ట్‌లెట్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 200/8; వికెట్ల పతనం: 1-50, 2-107, 3-111, 4-111, 5-123, 6-135, 7-140, 8-166; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-36-2, బుమ్రా 4-0-35-0, శార్దూల్ 4-0-39-4, బాష్ 4-0-42-1, రఘు శర్మ 2-0-22-0, జాక్స్ 1-0-9-0, రాజ్ బవా 1-0-11-1.
ముంబై: రోహిత్ (బి) చాహల్ 25, రికెల్టన్ (సి) ప్రియాన్ష్ (బి) ఒమర్జాయ్ 48, నమన్ (సి) అర్ష్‌దీప్ (బి) యాన్సెన్ 9, తిలక్ (నాటౌట్) 75, రూథర్‌ఫోర్డ్ (సి) బార్ట్‌లెట్ (బి) ఒమర్జాయ్ 20, జాక్స్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 19.5 ఓవర్లలో 205/4. వికెట్ల పతనం: 1-61, 2-81, 3-88, 4-149; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-29-0, ఒమర్జాయ్ 4-0-36-2, యాన్సెన్ 4-0-55-1, బార్ట్‌లెట్ 3.5-0-53-0, చాహల్ 4-0-32-1.

ఈ వార్తలు కూడా చదవండి
వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్
చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్