తిలక్ వర్మకు భారత్ ‘ఎ’ పగ్గాలు
ABN , Publish Date - May 15 , 2026 | 02:05 AM
వచ్చే నెలలో శ్రీలంక వేదికగా ‘ఎ’ జట్ల ముక్కోణపు వన్డే టోర్నీ జరగనుంది. జూన్ తొమ్మిదిన ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ ‘ఎ’ జట్లు...
వైభవ్‌కు చోటు
శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంక వేదికగా ‘ఎ’ జట్ల ముక్కోణపు వన్డే టోర్నీ జరగనుంది. జూన్ తొమ్మిదిన ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ ‘ఎ’ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీ్‌సలో పాల్గొనే భారత్ ‘ఎ’ జట్టును గురువారం ప్రకటించారు. హైదరాబాదీ తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారు. రియాన్ పరాగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పించారు. మ్యాచ్‌లన్నీ దంబుల్లాలో జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా రెండు టీమ్‌లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు జూన్ 21న జరిగే ఫైనల్లో తలపడతాయి. ముక్కోణపు టోర్నీ అనంతరం భారత్, శ్రీలంక ‘ఎ’ జట్లు నాలుగు రోజులు సాగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఢీకొంటాయి. గాలెలో జరిగే ఈ రెండు టెస్ట్‌లకు భారత జట్టును తర్వాత ప్రకటిస్తారు.
భారత్ ‘ఎ’ జట్టు
తిలక్ వర్మ (కెప్టెన్), రియాన్ పరాగ్ (వైస్-కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (కీపర్), సూర్యాన్ష్ షెడ్గే, హర్ష్ దూబే, నిషాంత్ సిద్ధూ, అర్షద్ ఖాన్, ఆయుష్ బదోనీ, కుమార్ కుశాగ్ర (కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్.
ఇవీ చదవండి:
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..