Share News

ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి కీలక ప్లేయర్!

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:42 PM

వచ్చే నెలలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమండియా సిద్ధమవుతోంది. అయితే, ఈ సిరీస్‌లో అఫ్గాన్‌.. భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో జట్టులోకి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇస్తున్నాడు.

ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి కీలక ప్లేయర్!
Krunal Pandya

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవలే శ్రీలంకపై 1-0తేడాతో భారత్ టెస్టు సిరీస్ గెలిచింది. లంక పర్యటనను ముగించుకున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కోసం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 13,15,17 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. భారత్‌లో టీమిండియాకు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అఫ్గాన్‌లో నెలకున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.


అఫ్గానిస్థాన్‌తో జరగనున్నఈ టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి ఊహించని ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా రిపోర్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. కృనాల్ పాండ్యాను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో సెలక్టర్లు కృనాల్‌ను తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో అక్షర్‌ పటేల్‌ ప్రదర్శన పట్ల సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో కొత్త లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్‌ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్ల చూపు కృనాల్‌ పాండ్యాపై పడినట్లు సదరు రిపోర్టర్‌ వెల్లడించారు.


ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ?

2018లో కృనాల్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2021లో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన కృనాల్‌.. 130, 124 పరుగులు చేశాడు. అదే విధంగా.. వన్డేల్లో రెండు, టీ20లలో 15 వికెట్లు తీశాడు. 35 ఏళ్ల కృనాల్‌ పాండ్యా ఐపీఎల్‌ 2025,2026 సీజన్లలో ఆర్సీబీ తరఫున అద్భత ప్రదర్శన కనబరిచాడు.


ఇవి కూడా చదవండి:

ఎందుకీ డ్రామాలు?.. పాక్ ప్లేయర్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఫైర్

వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన.. 57 ఏళ్ల రికార్డు బద్దలు

Updated Date - Aug 31 , 2026 | 04:45 PM