Share News

ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. కీలక సమయంలో చర్చలు..

ABN , Publish Date - Aug 31 , 2026 | 04:31 PM

షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో సోమవారం ఈ సమావేశం జరిగింది.

ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. కీలక సమయంలో చర్చలు..
PM Modi Pezeshkian meeting

ఇంటర్నెట్ డెస్క్: షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఫిబ్రవరిలో ఇరాన్‌-అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరువురు నేతలు ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే తొలిసారి (PM Modi Pezeshkian meeting).


భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల తాజా పరిస్థితిని ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసి, విస్తరించాల్సిన అవసరం గురించి చర్చించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఈ కీలక భేటీ జరగడం ఆసక్తికరంగా మారింది (India Iran relations).


అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూసివేత, అమెరికా ఆంక్షల కారణంగా భారత్ సహా పలు దేశాల వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. భారత్‌కు ఇరాన్ భౌగోళికంగా, వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలక దేశం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో మోదీ, పెజెష్కియాన్ ముఖాముఖి చర్చలు జరపడం రెండు దేశాల భవిష్యత్ సహకారానికి కీలక పరిణామంగా మారింది (Bishkek SCO Summit).


ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా మోదీ ఇప్పటికే అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తో కూడా సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక వ్యవహారాలు, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు చర్చించారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా మోదీ భేటీ కావాల్సి ఉంది. అలాగే కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి..

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..


పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Aug 31 , 2026 | 04:54 PM