స్టీవ్ వా, రికీ పాంటింగ్ రికార్డులను బ్రేక్ చేసిన జో రూట్!
ABN , Publish Date - Sep 09 , 2026 | 08:00 PM
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌తో రూట్ తన కెరీర్‌లో 169 టెస్టు మ్యాచులను పూర్తి చేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన బ్యాటర్, కెప్టెన్ జో రూట్ తన సుదీర్ఘ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌తో రూట్ తన కెరీర్‌లో 169 టెస్టు మ్యాచులను పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్, స్టీవ్ వా రికార్డులను అధిగమించాడు.
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు రికీ పాటింగ్, స్టీవ్ వా చెరో 168 మ్యాచ్‌లు ఆడారు. ఇక అత్యధికి టెస్టు మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో భారత్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన కెరీర్‌లో సచిన్ 200 టెస్టులు ఆడారు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 188 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు జో రూట్ 169 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 50.38 సగటుతో 14,208 పరుగులు సాధించిన రూట్, తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన సీనియర్ ప్లేయర్‌గానూ అతను సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. టెస్టుల్లో అసాధారణ రికార్డులతో దూసుకెళ్తున్న రూట్, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ వైట్ బాల్ జట్లకు స్పెషలిస్ట్ మెంటార్‌గా మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ నియామకాన్ని జో రూట్ మద్దతిచ్చాడు. పీటర్సన్ అనుభవం, అతని ప్రభావం యువ ఆటగాళ్లపై ఎంతో ఉంటుందని రూట్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
50 వేల టికెట్లు సేల్.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లకు హౌస్‌ఫుల్ హంగామా!
ప్రపంచ రికార్డును సమం చేసిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు