Share News

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:56 PM

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు.

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన  ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్
Joe Root

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌, కెప్టెన్ జో రూట్‌ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.


జో రూట్‌ (62*)తో పాటు జోర్డన్‌ కాక్స్‌(59*) అర్ద సెంచరీలతో రాణించడంతో మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 453, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.


టెస్టుల్లో అత్యధిక అర్ధ శతకాలు

69* - జో రూట్(ఇంగ్లండ్)

68 - సచిన్ టెండూల్కర్(భారత్)

66 - ఎస్. చందర్‌పాల్(వెస్టిండీస్)

63 - అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా)

63 - రాహుల్ ద్రవిడ్(భారత్)

62 - రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)


ఇవి కూడా చదవండి:

15 ఏళ్ల క్రితం నాటి సచిన్‌ ఔట్‌పై కామెంట్.. నెట్టింట పాక్‌ క్రికెటర్ నవ్వులపాలు!

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అవమానకర గోల్.. వీడియో వైరల్

Updated Date - Sep 12 , 2026 | 07:06 PM